నిరూపిస్తే నేను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా.. మరి నువ్వు..?
మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తనకు వ్యతిరేకంగా కులం పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు రాసి ఉన్న కరపత్రాలను పంచారని ఆప్ అభ్యర్థి అతిషి ఆరోపించారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ స్పందించారు. నాపై చేస్తున్న ఆరోపణలకు రుజువు ఉంటే తీసుకురావాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఆప్ అభ్యర్థి అతిషి లకు సూచించారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే కేజ్రీవాల్ తోనే రాజీనామా పత్రాన్ని రాయించి.. ప్రజా క్షేత్రంలోనే ఆ లేఖపై సంతకం చేస్తానని గంభీర్ సవాల్ […]
మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తనకు వ్యతిరేకంగా కులం పేరుతో అభ్యంతరకర వ్యాఖ్యలు రాసి ఉన్న కరపత్రాలను పంచారని ఆప్ అభ్యర్థి అతిషి ఆరోపించారు. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ స్పందించారు. నాపై చేస్తున్న ఆరోపణలకు రుజువు ఉంటే తీసుకురావాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఆప్ అభ్యర్థి అతిషి లకు సూచించారు. ఒకవేళ ఆరోపణలు నిజమైతే కేజ్రీవాల్ తోనే రాజీనామా పత్రాన్ని రాయించి.. ప్రజా క్షేత్రంలోనే ఆ లేఖపై సంతకం చేస్తానని గంభీర్ సవాల్ విసిరారు. ఒకవేళ నాపై చేస్తున్న ఆరోపణలు తప్పని రుజువైతే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి, రాజకీయాల్లో నుంచి తప్పుకుంటారా? అని కేజ్రీవాల్‌ను గంభీర్ ప్రశ్నించారు.