తెలంగాణ బిజెపిలో కొత్త పంచాయితీ.. లక్ష్మణ్‌కు తలనొప్పులేనా?

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో ఇప్పుడు కొత్త లొల్లి నడుస్తోంది. పాత లీడర్లు వర్సెస్‌ కొత్త నాయకుల మధ్య ఫైట్‌ తీవ్రమైంది. కొత్త వారికే పదవులా? పాత వారిని పట్టించుకోరా అంటూ నాయకుడ్ని నిలదీశారట కొందరు పాత లీడర్లు. తెలంగాణ కమలంలో ఈ కొట్లాట ఇప్పుడు ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీలో కన్పిస్తోంది. బీజేపీ రాష్ట్ర శాఖలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న కోర్ క‌మిటీ అమోదం కీల‌కం. బీజేపీ కోర్ కమిటీ తీసుకొనే నిర్ణయాలనే పార్టీ […]

తెలంగాణ బిజెపిలో కొత్త పంచాయితీ.. లక్ష్మణ్‌కు తలనొప్పులేనా?
Follow us

|

Updated on: Nov 20, 2019 | 7:44 PM

క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న బీజేపీలో ఇప్పుడు కొత్త లొల్లి నడుస్తోంది. పాత లీడర్లు వర్సెస్‌ కొత్త నాయకుల మధ్య ఫైట్‌ తీవ్రమైంది. కొత్త వారికే పదవులా? పాత వారిని పట్టించుకోరా అంటూ నాయకుడ్ని నిలదీశారట కొందరు పాత లీడర్లు. తెలంగాణ కమలంలో ఈ కొట్లాట ఇప్పుడు ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీలో కన్పిస్తోంది.

బీజేపీ రాష్ట్ర శాఖలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న కోర్ క‌మిటీ అమోదం కీల‌కం. బీజేపీ కోర్ కమిటీ తీసుకొనే నిర్ణయాలనే పార్టీ నేతలు పాటిస్తారు. కోర్ కమిటీలోకి ఎవరిని తీసుకోవాలి? అనేది పూర్తి అధ్యక్షుడి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కీలకమైన ఈ కమిటీలోకి ఇష్టమొచ్చినట్లు నేతలను తీసుకుంటున్నారని తాజాగా రగడ మొదలైంది. ఇత‌ర పార్టీల నుంచి వస్తున్న నేతలను డైరెక్టుగా కోర్ క‌మిటీలోకి ఎలా తీసుకుంటున్నారనే అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది.

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిలో ఎవరికైనా కాస్త పేరుంటే చాలు కోర్ క‌మిటీ మెంబ‌ర్‌గా తీసుకుంటున్నారు. డీకే అరుణ‌, జితేందర్ రెడ్డి, వివేక్, పెద్దిరెడ్డి, పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి, గ‌రిక‌పాటి మోహ‌న్ రావు వంటి నేత‌ల‌కు కోర్ క‌మిటిలో చోటు క‌ల్పించారు. కీలకమైన కోర్‌కమిటీలో కొత్తగా వచ్చినవారికి చోటు ఇచ్చి…పాత నేతలను పక్కన పెడుతున్నారని సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. పార్టీకి ఇన్నాళ్లు చేసిన సేవను గుర్తించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

ఎన్నో అటుపోటుల‌ను ఎదుర్కొని పార్టీని నిల‌బెట్టింది కార్యకర్తలు, కొంత‌మంది నేత‌లే. ద‌శాబ్దాల పాటు పార్టీలో ఉంటూ.. పార్టీనే న‌మ్ముకున్న వారికి కోర్ కమిటీలో స్థానం కల్పించడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు సీనియర్ లీడర్లు. మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, చింతల‌ రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాక‌ర్ లాంటి సీనియ‌ర్ నేత‌ల‌కు కూడా కోర్ క‌మిటీలో స్థానం క‌ల్పించ‌క పోవ‌డం ప‌ట్ల పార్టీలో ప‌నిచేస్తున్న సీనియ‌ర్లు మండిప‌డుతున్నారు. మరో పక్క ఒక్కసారి కూడా ప్రజల్లో గెలుపొందని పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని కోర్ కమిటిలోకి తీసుకోవడం ఏంటి అని అధ్యక్షుడిని నిల‌దీసిన‌ట్టు నేతలు మధ్య చర్చ జరుగుతోంది. ఇది కేవ‌లం తాత్కాలిక కోర్ క‌మిటీ మాత్రమేన‌ని, త్వరలోనే కొత్త కమిటీ వస్తుందని ఆయన అధ్యక్షుడుగా సర్దిచెప్పే ప్రయత్నం చేశారట.

అయితే.. జాతీయ స్థాయిలో ప్రాభవం పెరిగిన నేపథ్యంలో కిషన్ రెడ్డి తరపున పార్టీలో చేరుతున్న వారికి అధిక ప్రాధాన్యతనివ్వడంపై కూడా చర్చ జరుగుతోంది. పార్టీలోకి వ‌ల‌స‌ల జోరు కొనసాగుతుంద‌న్న జోష్ మీద ఉన్న తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఈ కోర్ క‌మిటీ వివాదాలు కొత్త తల‌నొప్పుల‌ను తీసుకు వ‌చ్చేలా ఉంద‌న్న ఆందోళ‌నలో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..