మోదీ హెలీకాఫ్టర్‌లో ట్రంక్ బాక్స్..! కథా.. కమామీషూ..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఫ్లైట్‌లో నగదు తరలిస్తున్నారా..? బ్లాక్‌ బాక్స్‌లో నగదు ఉంచి.. ఎవరికి అనుమానం రాకుండా.. నగదు తీసుకెళ్తున్నారా..? అంటే అవునని అంటోంది కర్నాటక కాంగ్రెస్. రెండు రోజుల క్రితం కర్నాటక చిత్రదుర్గలో మోదీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే.. అందులో నుంచి ఒక ట్రంక్ బాక్స్ తీసుకొని కొందరు యువకులు పరుగులు తీశారు. అనంతరం ఇన్నోవా కారులో ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే.. అందులో నగదు తీసుకెళ్లారని […]

మోదీ హెలీకాఫ్టర్‌లో ట్రంక్ బాక్స్..!  కథా.. కమామీషూ..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 15, 2019 | 6:25 PM

ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఫ్లైట్‌లో నగదు తరలిస్తున్నారా..? బ్లాక్‌ బాక్స్‌లో నగదు ఉంచి.. ఎవరికి అనుమానం రాకుండా.. నగదు తీసుకెళ్తున్నారా..? అంటే అవునని అంటోంది కర్నాటక కాంగ్రెస్. రెండు రోజుల క్రితం కర్నాటక చిత్రదుర్గలో మోదీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే.. అందులో నుంచి ఒక ట్రంక్ బాక్స్ తీసుకొని కొందరు యువకులు పరుగులు తీశారు. అనంతరం ఇన్నోవా కారులో ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే.. అందులో నగదు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

మోదీ ఫ్లైట్ నుంచి తీసుకెళ్లిన బ్లాక్ కలర్ బాక్స్‌లో ఏముంది..? అఫీషియల్ కాన్వాయ్‌లో కాకుండా దూరంగా ఉన్న ఇన్నోవాలోకి ఆ ట్రంక్ బాక్స్ ఎందుకు తీసుకెళ్లారు? మోదీ ఫ్లైట్ నుంచి ప్రైవేట్ వెహికల్‌లోకి ట్రంక్ బాక్స్ ఎందుకు వెళ్లిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. మోదీ ఫ్లైట్ నుంచి ప్రైవేట్ వెహికల్‌లోకి ట్రంక్ బాక్స్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నిస్తోంది.

ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా 50 వేల రూపాయలకు మించి నగదు తరలించవద్దని చెప్తోంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఇలా భిన్నమైన మార్గాల్లో నగదు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ట్రంక్ బాక్స్‌లో ఉన్నది డబ్బే అయితే.. అరికట్టడంలో ఎన్నికల సంఘం విఫలమైనట్లేనని మండిపడుతున్నారు. ట్రంక్ బాక్స్ కథ తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.