టీ.. అసెంబ్లీలో కాంగ్రెస్ ఖేల్ ఖతం ! ప్రతిపక్ష హోదా అంతం !

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోల్పోయింది. మొత్తం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది తెరాసలోకి ఫిరాయించి తమను ఆ పార్టీ శాసనసభా పక్షంలో విలీనమైనట్టు స్పీకర్ ను కోరడంతో.. ఈ పార్టీకి ప్రతిపక్ష స్థాయికూడా దక్కకుండా పోయింది. అలాగే సీఎల్ఫీ నాయకుడు మల్లుభట్టివిక్రమార్క విపక్ష నేత హోదా కోల్పోయారు. దీంతో శాసన సభలో ప్రధాన ప్రతిపక్షమంటూ లేకపోవడంతో ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎంఐఎం అతి పెద్ద పార్టీ అయింది. ఈ మేరకు […]

  • Anil kumar poka
  • Publish Date - 11:30 am, Thu, 27 June 19
టీ.. అసెంబ్లీలో కాంగ్రెస్ ఖేల్ ఖతం ! ప్రతిపక్ష హోదా అంతం !

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థాయిని కోల్పోయింది. మొత్తం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది తెరాసలోకి ఫిరాయించి తమను ఆ పార్టీ శాసనసభా పక్షంలో విలీనమైనట్టు స్పీకర్ ను కోరడంతో.. ఈ పార్టీకి ప్రతిపక్ష స్థాయికూడా దక్కకుండా పోయింది. అలాగే సీఎల్ఫీ నాయకుడు మల్లుభట్టివిక్రమార్క విపక్ష నేత హోదా కోల్పోయారు. దీంతో శాసన సభలో ప్రధాన ప్రతిపక్షమంటూ లేకపోవడంతో ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎంఐఎం అతి పెద్ద పార్టీ అయింది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ వి. నరసింహాచార్యులు బుధవారం ఓ బులెటిన్ జారీ చేశారు. మల్లు భట్టివిక్రమార్కకు రాసిన లేఖలో ఆయన.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలమేరకు సభలో మీ పార్టీ బలం ఆరుకు తగ్గిపోయిందని, ఫలితంగా మీ పార్టీ విపక్ష హోదా కోల్పోయిందని తెలిపారు. ఈ నెల 6 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు భావించాలన్నారు. అటు-మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఐదుకు తగ్గనుంది. ఇదిలా ఉండగా.లోక్ సభకు ఎన్నికైన . టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో.. ఇక ఈ పోస్టుకు ఖాళీ ఏర్పడింది. రాజగోపాలరెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల యూపీ కాంగ్రెస్ శాఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల పీసీలను కూడా ఇలాగే రద్దు చేయాలని ఆయన నిర్ణయించుకున్న పక్షంలో టీపీసీసిని కూడా రద్దు చేస్తారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాలకు ఆయన కొత్త నాయకులను ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతోంది.