మా సీట్లు మాకే తిరిగి ఇచ్చేయండి: భట్టి

బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరుగుతోంది. చర్చను ప్రారంభించిన మజ్లిస్ పక్షనేత అక్బరుద్ధీన్ ఓవైసీ. అయితే.. సడన్‌గా సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష సీట్లను.. ఎంఐఎంకి కేటాయించారు. దీనిని నిరసిస్తూ.. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి‌కి లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ భట్టి విక్రమార్క. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం సీట్లను.. ఎంఐఎంకు కేటాయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీట్ల మార్పుపై స్పీకర్‌కు లేఖ రాసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సభలో ప్రతిపక్షానికి […]

మా సీట్లు మాకే తిరిగి ఇచ్చేయండి: భట్టి
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 1:26 PM

బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరుగుతోంది. చర్చను ప్రారంభించిన మజ్లిస్ పక్షనేత అక్బరుద్ధీన్ ఓవైసీ. అయితే.. సడన్‌గా సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష సీట్లను.. ఎంఐఎంకి కేటాయించారు. దీనిని నిరసిస్తూ.. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి‌కి లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ భట్టి విక్రమార్క.

తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం సీట్లను.. ఎంఐఎంకు కేటాయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీట్ల మార్పుపై స్పీకర్‌కు లేఖ రాసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సభలో ప్రతిపక్షానికి తగిన స్థానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. లేఖలో పేర్కొన్నారు. స్నేహపూర్వక పార్టీని ప్రతిపక్ష పార్టీగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష బ్లాక్‌ను తిరిగి కాంగ్రెస్‌కు కేటాయించాలని భట్టి విక్రమార్క.. స్పీకర్‌కు వినతి చేశారు.