కమల వికాసానికి మా తోడ్పాటు, బెంగాల్ లో బీజేపీలో చేరిన సినీ, టీవీ యాక్టర్స్

బెంగాల్ ఎన్నికలముందు సినీ, టీవీ నటీనటులను బీజేపీ సాదరంగా ఆహ్వానిస్తోంది. తాజాగా శనివారం టీవీ, సినీ స్టార్స్ రాహుల్ చక్రవర్తి,  దేవశ్రీ భట్టాచార్య ఈ పార్టీలో చేరారు.

కమల వికాసానికి మా తోడ్పాటు, బెంగాల్ లో బీజేపీలో చేరిన సినీ, టీవీ యాక్టర్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 06, 2021 | 8:20 PM

బెంగాల్ ఎన్నికలముందు సినీ, టీవీ నటీనటులను బీజేపీ సాదరంగా ఆహ్వానిస్తోంది. తాజాగా శనివారం టీవీ, సినీ స్టార్స్ రాహుల్ చక్రవర్తి,  దేవశ్రీ భట్టాచార్య ఈ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దీపాలీ సహా తో బాటు మరికొంతమంది కూడా కమలానికి జై కొట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ధుడు దిలీప్ ఘోష్ వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన మరునాడే వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పార్టీ అంటే తమకెంతో మక్కువ అని, ఇందులో చేరాలని తాను ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు అవకాశం లభించిందని రాహుల్ చక్రవర్తి పేర్కొన్నాడు. అసలు పెద్ద స్టార్ నరేంద్ర మోదీ అని ఆయన ప్రశంసించాడు. పార్టీ తరఫున ప్రచారం చేస్తానని, ఈ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వరిస్తానని అన్నాడు.

అటు తృణమూల్ కాంగ్రెస్ అవినీతికర పార్టీ అని, కానీ బీజేపీ శుధ్ధమైనదని అందుకే చేరానని దేవిశ్రీ భట్టాచార్య అన్నారు. తన బంధువులు తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నా.. తనకు అభ్యంతరం లేదని, ఇక్కడ రాజకీయాల్లో బంధు ప్రేమ ఉండరాదని ఆమె చెప్పారు. కాగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరి కొంతమంది సినీ, టీవీ స్టార్స్ ను కూడా చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది, బెంగాలీ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయనను ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్  ఆ మధ్య ముంబైలో కలుసుకున్న సంగతి విదితమే. అయితే తమ మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదంటూ మిథున్ సున్నితంగా తప్పించుకున్నారు. రేపు బెంగాల్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీతో బాటు ఆయన వేదికనలంకరిస్తారని వార్తలు వస్తున్నా బీజేపీలో చేరుతారా లేదా అన్నది మాత్రం స్పష్టం కావడంలేదు

మరిన్ని ఇక్కడ చదవండి:

మ్యూజిక్ లవర్స్‌ని షేక్ చేస్తున్న హైబ్రిడ్ పిల్ల ‘సారంగ దరియా’.. అసలు ఈ పాట ఎవరిదో తెలుసా?..

International Women’s Day 2021: అందమైన అతివలకు… అదిరిపోయే డ్రెస్సింగ్ ఐడియాస్.. ఉమెన్స్‌ డే సందర్బంగా ఓ లుక్కేయండి!