ఐదేళ్ల క్రితం ఇదే రోజున నమ్మక ద్రోహం: చంద్రబాబు

ఐదేళ్ల క్రితం ఇదే రోజున నమ్మక ద్రోహం: చంద్రబాబు

విజయవాడ: ఫిబ్రవరి 20. ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఏపీకి నమ్మక ద్రోహం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ట్విట్టర్‌లో ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రత్యేక హాదాతో సహా మరో 5 హామీలను కేంద్రం గాలికి వదిలేసిందన్నారు. ఏపీకి నమ్మక ద్రోహం జరిగి నేటికి ఐదేళ్లు పూర్తవుతుందని అన్నారు. “ఫిబ్రవరి 20, సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ద్రోహం చేసి ఐదేళ్లు. 5 కోట్ల మందిని […]

Vijay K

| Edited By: Ram Naramaneni

Oct 08, 2020 | 8:18 PM

విజయవాడ: ఫిబ్రవరి 20. ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఏపీకి నమ్మక ద్రోహం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ట్విట్టర్‌లో ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రత్యేక హాదాతో సహా మరో 5 హామీలను కేంద్రం గాలికి వదిలేసిందన్నారు. ఏపీకి నమ్మక ద్రోహం జరిగి నేటికి ఐదేళ్లు పూర్తవుతుందని అన్నారు.

“ఫిబ్రవరి 20, సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ద్రోహం చేసి ఐదేళ్లు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి ప్రత్యేక హాదాతో సహా మరో 5 హామీలు గాలికి వదిలేసింది. వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకుంది. బీజేపీ చేసిన ఈ నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu