Chintan Shivir: సెల్ ఫోన్లకు అనుమతి లేదు.. కాంగ్రెస్​కు లీకుల గోల .. చింతన్ శిబిర్‌లోకి కొత్త నిబంధనలు..

Congress chintan shivir: సమావేశాల్లో జరుగుతున్న స్థలంలో పూర్థి స్థాయలో నిబంధనలు అమలు చేస్తోంది. ఇవన్నీ ఎక్కడో కాదు రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో జరుగుతున్న కాంగ్రెస్ 'చింతన్ శిబిర్'లో కొనసాగుతున్న నిబంధనలు.

Chintan Shivir: సెల్ ఫోన్లకు అనుమతి లేదు.. కాంగ్రెస్​కు లీకుల గోల .. చింతన్ శిబిర్‌లోకి కొత్త నిబంధనలు..
Chintan Shivir
Follow us

|

Updated on: May 13, 2022 | 4:20 PM

చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అక్కడికి వచ్చేవారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. గుర్తు పత్రాలు ఉంటే కానీ లోపలకిి అనుమతి ఇవ్వండం లేదు. కనీసం ఫోన్లు సమావేశాలకు తీసుకురావడంపై బ్యాన్ పెట్టింది. సమావేశాల్లో జరుగుతున్న స్థలంలో పూర్థి స్థాయలో నిబంధనలు అమలు చేస్తోంది. ఇవన్నీ ఎక్కడో కాదు రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో జరుగుతున్న కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’లో కొనసాగుతున్న నిబంధనలు. అయితే ఈ సమావేశాలకు 430 మంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ, ఉపాధి, పార్టీ సంస్థాగత ప్రక్షాళన అంశాలపై వీరంతా కలిసి చర్చించి.. తీర్మానాలు రెడీ చేస్తారు. చింతన్ శిబిర్​లో రూపొందించిన తీర్మానాలకు సీడబ్ల్యుసీ ఆమోదం లభించిన తరువాత సరికొత్త వ్యూహాలతో రాష్ట్రాల్లోని తమ పార్టీల ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ.

పార్టీ భవితవ్యాన్ని తేల్చడంలో కీలకమని భావిస్తున్న చర్చల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది.. అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 2024 టార్గెట్‌గా ముందుకు వళ్తోంది. సమావేశాల్లో చర్చకు వచ్చే విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతోంది. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై ఏర్పాటైన ఆరు కమిటీల సభ్యులెవరూ తమ మొబైల్ ఫోన్లను వెంట ఉంచుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

నవ సంకల్ప్ చింతన్ శిబిర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ఉదయ్​పుర్​లోని తాజ్ ఆరవళిలో జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు వివిధ అంశాలపై నేతలు చర్చించనున్నారు. సభ్యులను ఆరు కమిటీలుగా విభజించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల ఇంఛార్జీలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మాజీ కేంద్రమంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశాలకు హాజరయ్యారు. ఆదివారం చర్చలకు చివరి రోజు కాగా.. ఆరోజు ఉదయం 11గం.లకు వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. సమావేశంలో రూపొందించిన డిక్లరేషన్​పై కమిటీ చర్చించనుంది.

జాతీయ రాజకీయ వార్తల కోసం..

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!