గతంలో కంటే 55 సీట్లు అదనంగా గెలుచుకుంటాం: అమిత్ షా

న్యూఢిల్లీ: గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే తాము ఈ సారి 55 సీట్లను అధికంగా గెలుచుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ‘2014లో ఓడిపోయిన 120 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది. వాటిల్లో 55 కంటే అధిక స్థానాల్లో విజయం సాధిస్తాం. ఈ ఎన్నికల్లో మా పార్టీ పశ్చిమ బెంగాల్‌లో 23 కంటే అధిక సీట్లను, […]

గతంలో కంటే 55 సీట్లు అదనంగా గెలుచుకుంటాం: అమిత్ షా
Follow us

|

Updated on: May 10, 2019 | 8:43 PM

న్యూఢిల్లీ: గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే తాము ఈ సారి 55 సీట్లను అధికంగా గెలుచుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ‘2014లో ఓడిపోయిన 120 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది. వాటిల్లో 55 కంటే అధిక స్థానాల్లో విజయం సాధిస్తాం. ఈ ఎన్నికల్లో మా పార్టీ పశ్చిమ బెంగాల్‌లో 23 కంటే అధిక సీట్లను, ఒడిశాలో 13-15 సీట్లను గెలుచుకుంటుంది. మొత్తానికి మా పార్టీ పూర్తి మెజార్టీ సాధించనుంది’ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ 2, ఒడిశాలో 1 సీటును గెలుచుకుంది.