ఏపీ గవర్నర్‌తో బీజేపీ, జనసేన భేటీ.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం కుట్ర జరుగుతుందన్న నేతలు

ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ తో బిజెపి, జనసేన నేతలు భేటీ అయ్యారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నుంచి

  • K Sammaiah
  • Publish Date - 1:36 pm, Thu, 28 January 21
ఏపీ గవర్నర్‌తో బీజేపీ, జనసేన భేటీ.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం కుట్ర జరుగుతుందన్న నేతలు

ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ తో బిజెపి, జనసేన నేతలు భేటీ అయ్యారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌ తదితర నేతలు గవర్నర్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వివరించామని జనసేన నేత నాందెండ్ల మనోహర్‌ అన్నారు. గతంలో నామినేషన్ లు కూడా వేయకుండా అధికార పార్టీ అడ్డుకున్న విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. ఈసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని గవర్నర్ ని కోరామన్నారు.

ఏకగ్రీవాలు సహజమే అయినా… ప్రలోభ పెట్టి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయాలని చూస్తున్నారని, వివిధ ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా గవర్నర్‌కు వివరించామని నాదెండ్ల చెప్పారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సాయం ఇవ్వలేదు. ఆలయాల పై జరుగుతున్న దాడులను కూడా వివరించామని అన్నారు. వాలంటీర్ ల ద్వారా అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్ కు అధికార యంత్రాంగం సహకరించాలి. అన్ని వ్యవస్థ లు కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలే చూడాలని గవర్నర్‌ను కోరినట్లు నాదేండ్ల మనోహర్‌ తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారపార్టీ అనేక అరాచకాలకు పాల్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఈసారి అలా జరగకూడదనే గవర్నర్ ను కలిశామని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్న్‌ను కోరినట్లు చెప్పారు. ఆలయాల‌ పై దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సోము వీర్రాజు మండిపడ్డారు.

ఎక్కడా కూడా సిట్ వేసి.. విచారణ వేగ వంతం చేయలేదు. కానీ ఇతర పార్టీలు కార్యకర్తలు ను దోషులుగా అక్రమ కేసులు పెట్టారని పండిపడ్డారు. మేము ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టు లు‌ చేస్తున్నారు. బిజెపి పాత్ర ఉందని‌ చెప్పడం ప్రభుత్వం నీతి మాలిన చర్య అని సోము మండిపడ్డారు. రాష్ట్రం లో మత విద్వేషాలను ప్రభుత్వమే రెచ్చగొడుతుందని ఆరోపించారు. చర్చి ఫాదర్ లకు కూడా ప్రజా ధనం ఎందుకు పంచుతున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు.

పంచాయతీ ఎన్నికలకు ఆన్ లైన్ లో నామినేషన్ ల‌ విధానాన్ని అమలు‌ చేయాలి.ఎన్నికలు సవజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు.

 

ఏపీలో కొనసాగుతున్న వైసీపీ వర్సెస్‌ ఎస్‌ఈసీ.. ఎన్నికల నిర్వహణపై మండిపడ్డ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు

వారణాసిలో సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పర్యటన.. స్వామివారికి ప్రత్యేక పూజలు.. పట్టువస్త్రాల సమర్పణ