Bandi Sanjay: అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బిల్లు.. కుటుంబ నియంత్రణపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

అధికారంలోకి వచ్చిన వెంటనే జనాభా నియంత్రణ బిల్లును తీసుకొస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌..

Bandi Sanjay: అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బిల్లు.. కుటుంబ నియంత్రణపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay

ఒకరు చాలు. ఇద్దరు పిల్లలు హద్దు. ముగ్గురు అసలే వద్దు అంటూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జనాభా నియంత్రణ బిల్లును తీసుకొస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. ముస్లిం రిజర్వేషన్ల వల్ల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నాయన్నాయని ఆరోపించారు. దీంతో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు బండి సంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామన్నారు టీ బీజేపీ చీఫ్ బండి.

ఇంతకీ యూపీ జనాభా నియంత్రణ పాలసీ ఏం చెబుతోంది? ఆ వివరాలేంటి? దీనికీ తెలంగాణకూ ఉన్న సారూప్యతలు ఎలాంటివి? అన్నదిప్పుడు చర్చనీయాంశమవుతోంది. ”చిన్న కుటుంబం కలిగి ఉండటం దేశభక్తి కలిగి ఉండటం ఒకటే” ఈ మాట అన్నది ఎవరో కాదు.. – 2019 ఆగస్టు 15న ప్రధాని మోడీ స్వయంగా చేసిన ప్రసంగ సారం. ఈ ఇన్ స్పిరేషన్ తోనే యూపీలో తాము పాపులేషన్ పాలసీని తీసుకొచ్చామని అంటారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఈ ప్రేరణతోనే జనాభా నియంత్రణ చేస్తామంటారు బండి సంజయ్.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు

Click on your DTH Provider to Add TV9 Telugu