నెక్ట్స్ సీఎం మావోడే.. బెట్ వేస్తావా..? ఏపీలో జోరుగా పందాలు

ఎన్నికలు ముగిశాయి.. గెలుపెవరిది? అధికారం.. టీడీపీకా, వైసీపీకా? ఇదే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గెలుపు టీడీపీది అని కొందరు అంటుంటే.. కాదు వైసీపీది అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో.. పందెం రాయుళ్లు సై అంటే సై అని కాలు దువ్వుతున్నారు. గతంలో లేని మాదిరి ఎన్నికల వేడి పెరగడంతో కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రాజకీయాలకు మించి హోరా హోరీగా పందాలు సాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని హాట్ సీట్లపై కోట్లలో పందాలు […]

నెక్ట్స్ సీఎం మావోడే.. బెట్ వేస్తావా..? ఏపీలో జోరుగా పందాలు

ఎన్నికలు ముగిశాయి.. గెలుపెవరిది? అధికారం.. టీడీపీకా, వైసీపీకా? ఇదే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గెలుపు టీడీపీది అని కొందరు అంటుంటే.. కాదు వైసీపీది అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో.. పందెం రాయుళ్లు సై అంటే సై అని కాలు దువ్వుతున్నారు. గతంలో లేని మాదిరి ఎన్నికల వేడి పెరగడంతో కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రాజకీయాలకు మించి హోరా హోరీగా పందాలు సాగుతున్నాయి.

ముఖ్యంగా కొన్ని హాట్ సీట్లపై కోట్లలో పందాలు కాస్తున్నారు. సొంత సర్వేలు చేయించుకొని మరీ పందెం కాస్తున్నారు. వాటి ఆధారంగానే పందెం ఎంతో చెప్తున్నారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరా హోరీగా ఉండటంతో ఎవరి అంచనాల్లో వారున్నారు. బెట్టింగ్ రాయుళ్లు కూడా వారికి ధీమా ఉన్న అభ్యర్థులపై పందెం కాస్తున్నారు. ఫలానా చోట ఆ అభ్యర్థి ఖాయం అని అనుకుంటే.. పందెం ఎంతైనా కాసేందుకు సిద్ధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు.. లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినా.. పందెం రాయుళ్ల టార్గెట్ మాత్రం అసెంబ్లీ అభ్యర్థులే. ఫలానా అసెంబ్లీ నియోజక వర్గంలో విజయం మా అభ్యర్థిదే అంటూ.. బెట్టింగ్‌కు దిగుతున్నారు. లోక్‌సభ ఎన్నికలను పెద్దగా పట్టించుకోని పందెం రాయుళ్లు.. అసెంబ్లీపైనే పూర్తిగా దృష్టి సారించారు. గెలుపు మాత్రమే కాదు.. మెజార్టీపై కూడా పందెం కాస్తున్నారు. అదే సమయంలో ఫలానా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని కాసే పందెం ఒకటైతే.. రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది..? ఎవరు సీఎం అవుతారు..? ఎన్ని సీట్లు వస్తాయన్న..? దానిపై బెట్టింగ్ సాగుతోంది.

పందెం రాయుళ్లు ఎక్కువగా.. భీమిలీ, గాజువాక, గుడివాడ, మంగళగిరి, చీరాల, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, జమ్మలమడుగు, హిందూపురం, భీమవరం, తాడేపల్లి గూడెం, వైజాగ్, సర్సాపురం నియోజక వర్గ సీట్లపై ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు.

ఎన్నికల వేళ పంటర్లు, బుకీలు తెగ బిజీ అయిపోయారంట. పందెం రాయుళ్లు బుకీల దగ్గరకు క్యూ కట్టారు. బుకీలకు 5 నుంచి 10 శాతం కమీషన్ దొరికుతోంది. కోసు పందెం, పెచ్చు పందెం.. ఇలా రకరకాలుగా బెట్టింగ్‌కు దిగుతున్నారు. పార్టీలు సర్వే చేయించడం సాధారణం. అయితే.. బుకీలు కూడా సర్వే చేయిస్తున్నారంట. దానిని బట్టి ఏ పార్టీ అభ్యర్థికి అవకాశం ఉందని చెప్తే.. అతనిపైనే పందెం కాస్తున్నారు. ఇక తెలివైన జాదుగాళ్లు.. తమ డబ్బులు నష్టపోకుండా.. మార్జిన్ పందాలు, బాక్స్ పందాలు కడుతున్నారు.

ఇదంతా నాణానికి ఒక వైపు అయితే.. మరోవైపు పందెం రాయుళ్లు దొరికితే మాత్రం తోలుతీస్తామని అంటున్నారు పోలీసులు. బెట్టింగ్‌లపై ఓ కన్నేసి ఉంచారు. అనుమానం ఉన్న చోట నిఘా పెంచారు.

Click on your DTH Provider to Add TV9 Telugu