ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ఎస్‌ఈసీ.. రేపటి నుంచి ప్రాంతాల వారీ స‌మావేశాల ఏర్పాటు

ఏపీలో పంచాయతీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలపై..

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ఎస్‌ఈసీ.. రేపటి నుంచి  ప్రాంతాల వారీ స‌మావేశాల ఏర్పాటు
Follow us

|

Updated on: Feb 26, 2021 | 2:54 PM

ఏపీలో పంచాయతీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం విజయవంతంగా పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికలపై అధికారపార్టీ అభ్యంతరాలు పెట్టినా పట్టుదలతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి పంత నెగ్గించుకుంది. పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లినా లాభం లేకపోయింది. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం వాదించింది. కరోనా నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపారు. దీంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయయి. నాలుగు దశల ఎన్నికలు ప్రశాంతంతా ముగియడంతో అటు ఎన్నికల సంఘం, ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను కూడా జరపాలని నిర్ణయించామని, ఉద్యోగులు అందుకు సిద్ధం కావాలని, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కోర్టు పరిధిలో ఒకటి, రెండు అంశాలు ఉన్నందున కొన్ని చోట్ల ఎన్నికలు జరపలేకపోయామని వెల్లడించిన నిమ్మగడ్డ, కేసులు పరిష్కారం కాగానే వాటికీ ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేశారు. మునిసిపల్ ఎన్నికలకు మాత్రం ఎటువంటి అవరోధాలూ లేవని అన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో 16 శాతం మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని, మిగతా చోట్ల పోలింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించామని తెలిపారు. 50 శాతం మంది మహిళలు, బలహీన వర్గాలకు చెందిన వారు విజయం సాధించారని అన్నారు. 10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నికయ్యారని నిమ్మగడ్డ పేర్కొన్నారు.

సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందని, 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల నుంచి కూడా ఇదే విధమైన స్పందన వస్తుందని భావిస్తున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఓటు వేయడం తమ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అందరికీ తెలిసిన ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి కాబట్టి, పట్టణ ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యఎప్పుడైనా వచ్చి ఓటేసి వెళ్లాలని అన్నారు.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ విజయవంతమైన ఊపులోనే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పుర‌పాలిక ఎన్నిక‌లపై ప్రాంతాల వారీ స‌మావేశాల‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం స‌న్న‌ద్ధ‌త కోస‌మే ప్రాంతాల వారీ స‌మావేశాల ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివ‌రించింది. ఈ నెల 27, 28, మార్చి 1న ప్రాంతీయ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ సెనేట్ హాల్‌లో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించింది.

ఈ స‌మావేశాల్లో భాగంగా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో ఎస్ఈసీ స‌మావేశం కానుంది. అలాగే, గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ నెల 27న (రేపు) ఐదు జిల్లాల్లో రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో స‌మావేశం ఉంటుంది. అనంత‌రం, ఎల్లుండి విజ‌య‌వాడ‌లోని కార్యాల‌యంలో ఎస్ఈసీ స‌మావేశం నిర్వ‌హిస్తుంది. ఇందులో మిగిలిన జిల్లాల అధికారులు పాల్గొంటారు.

Read more:

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జాబ్స్‌ ఫైట్‌.. గన్‌పార్క్‌ దగ్గర కుర్చీ వేసుకుని కాంగ్రెస్‌ వెయిటింగ్‌..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!