ఏపీ గవర్నర్‌తో ముగిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ.. రేపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే ఛాన్స్‌

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచారు. ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రేపు విడుదల..

ఏపీ గవర్నర్‌తో ముగిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ.. రేపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే ఛాన్స్‌
Follow us

|

Updated on: Jan 22, 2021 | 1:30 PM

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దూకుడు పెంచారు. ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ భేటీ ఆయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తో చర్చించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని గవర్నర్ కు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

మరోవైపు ఎన్నికలను అడ్డుకునేందుకు ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ దూకుడు.. మరోవైపు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుండటం ఆసక్తిగా మారింది.