Breaking: నిమ్మగడ్డ కేసు.. సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

నిమ్మగడ్డ రమేష్, ఏపీ ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. ఈ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం

Breaking: నిమ్మగడ్డ కేసు.. సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 7:19 PM

నిమ్మగడ్డ రమేష్, ఏపీ ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతోంది. ఈ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంలో ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్‌పి(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసింది. ఈ ఎస్ఎల్‌పి సుప్రీం రిజిస్ట్రార్ పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మస్తాన్ వలి తరపు న్యాయవాదులకు అత్యున్నత న్యాయస్థానం సమాచారం ఇచ్చింది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ని నియమించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా మస్తాన్ వలి కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కాగా మరోవైపు నిమ్మగడ్డ వ్యవహారంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళుతున్నామని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో లేకపోయినా తన మనుషులే అధికారులుగా ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్‌కి అనుకూలంగా తీర్పు వస్తే టీడీపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డకు ఇవన్నీ ‘ఎక్సస్ ఆఫ్ ఈవెల్‌’గా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ,కార్యకర్తలకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి చెప్పారు.

Read This Story Also: రైతులకు కేంద్రం శుభవార్త.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు!