ఏపీ ఉద్యోగ సంఘాల్లో విభేదాలు.. వెంకట్రామిరెడ్డిపై ముప్పేట దాడిని పెంచిన ఇతర ఉద్యోగ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికల విషయంలో మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న..

ఏపీ ఉద్యోగ సంఘాల్లో విభేదాలు.. వెంకట్రామిరెడ్డిపై ముప్పేట దాడిని పెంచిన ఇతర ఉద్యోగ సంఘాలు
Follow us

|

Updated on: Jan 27, 2021 | 5:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికల విషయంలో మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న ఉద్యోగులు తాజాగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం ఆసక్తిగా మారింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి సహకరించేంది లేదు. మా ప్రాణాలకంటే ఎన్నికలు ముఖ్యమా అంటూ మొండికేసిన ఉద్యోగ సంఘాల వైఖరిలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మార్పు వచ్చింది.

ఇక ఎన్నికల ప్రక్రయ వేగం పుంజుకోవడంతో ఉద్యోగుల సంఘాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. సచివాలయ ఉద్యోగుల సంఘ ఛైర్మన్‌, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఫెడరేషన్ వెంకట్రామిరెడ్డిపై అమరావతి ఉద్యోగుల సంఘం మండిపడింది. సచివాలయానికి వెళ్లినప్పుడు ఆయన దారుణంగా ప్రవరిస్తున్నారని విమర్శలు చేశారు రెవెన్యూ ఉద్యోగులు.

వెంకట్రామిరెడ్డి ప్రవర్తన సరిగా లేదని… ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అమరావతి ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. వెంకట్రామిరెడ్డికి.. కిందిస్థాయి ఉద్యోగులకు అసలు సంబంధాలే లేవని బొప్పరాజు అంటున్నారు. మొత్తానికి మొన్నటి వరకు ఐక్యమత్యంగా కనిపించిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రెండుగా చీలిపోవడం ఆసక్తిని రేపుతుంది.