AP Municipal Elections: నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం.. 98 వార్డుల్లో ఏకంగా 43 వార్డులు..

AP Municipal Elections: నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో వైసీపీ ప్రభంజనం కనిపించింది. 98 వార్డుల్లో 43 వార్డులు..

AP Municipal Elections: నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం.. 98 వార్డుల్లో ఏకంగా 43 వార్డులు..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 11:07 PM

AP Municipal Elections: నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలలో వైసీపీ ప్రభంజనం కనిపించింది. 98 వార్డుల్లో 43 వార్డులు వైసీపీకే ఏకగ్రీవం అయ్యాయి. వివరాల్లోకెళితే.. ఈనెల పదో తారీఖున మున్సిపాలిటీ ఎన్నికలు జరగనుండగా ఈరోజు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 98 వార్డులు ఉన్నాయి. ఈ 98 వార్డులకు గాను వైసీపీ 43 వ వార్డులను ఇప్పటికే ఏకగ్రీవం అయ్యి ఆ పార్టీ సత్తా చూపింది. ఇక బీజేపీ 1 వార్డు కైవసం చేసుకోగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సున్నాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఈనెల పదవ తారీఖున జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలలో అధికార పార్టీ తన జోరును కొనసాగించనుంది. ఏకగ్రీవ వార్డులలో అత్యధికంగా నాయుడుపేట మున్సిపాలిటీ లో 25 వార్డులకు గాను 20 ఏకగ్రీవాలు చేసి 90% పూర్తి చేసినట్లు అయ్యింది. అదేవిధంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను 14వ వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసింది. ఆత్మకూరు మున్సిపాలిటీ ఈ విషయంలో 23 వార్డులకు గాను 6 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. వెంకటగిరి మున్సిపాలిటీ లో వైసీపీ మూడు ఏకగ్రీవాలు చేసింది. మొత్తానికి జిల్లాలో 98 వార్డులకు గాను సుమారు 44 వార్డులు వైసీపీ ఏకగ్రీవం చేసి మిగిలిన 54 వార్డులకు ఎన్నికలకు వెళ్లనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ఒక్క ఏకగ్రీవం కాకపోవడం, బీజేపీకి సులూరుపేట మున్సిపాలిటీలో 1 వార్డు ఏకగ్రీవం చేసుకోవడం జిల్లాలో లో కొసమెరుపు. ఇది ఇలా ఉండగా ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎన్ని వార్డులు గెలుపొందనుందో వేచి చూడాల్సిందే.

Also read:

Tamilnadu Elections: తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. సంచలన ప్రకటన చేసిన చిన్నమ్మ శశికళ..

India vs England: నరేంద్ర మోదీ పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సైటర్లు.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌ కోసం నా ప్రాక్టీస్ సూపర్ అంటూ..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..