రాహుల్‌పై అమిత్ షా విమర్శలు

రాహుల్‌పై అమిత్ షా విమర్శలు

న్యూఢిల్లీ: పుల్వామా దాడికి కౌంటర్‌గా భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై చేసిన ఎయిర్ స్ట్రయిక్స్‌లో వాస్తవికతను  ప్రశ్నిస్తూ రాహుల్‌ గాంధీ సలహాదారు శామ్‌ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై జీజేపి ఛీఫ్ అమిత్ షా స్పందించారు.  శనివారం జరిగిన  మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై  కాంగ్రెస్ నీచ వ్యాఖ్యలు చేస్తుందని.. ఈ విషయంపై దేశ ప్రజలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ […]

Ram Naramaneni

|

Mar 23, 2019 | 3:45 PM

న్యూఢిల్లీ: పుల్వామా దాడికి కౌంటర్‌గా భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై చేసిన ఎయిర్ స్ట్రయిక్స్‌లో వాస్తవికతను  ప్రశ్నిస్తూ రాహుల్‌ గాంధీ సలహాదారు శామ్‌ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై జీజేపి ఛీఫ్ అమిత్ షా స్పందించారు.  శనివారం జరిగిన  మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై  కాంగ్రెస్ నీచ వ్యాఖ్యలు చేస్తుందని.. ఈ విషయంపై దేశ ప్రజలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమాధానం చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఓ వైపు ఉగ్రవాదులు రెచ్చిపోయి దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తుంటే..ఇంకా శాంతి మంత్రం వల్లవేస్తారా? అంటూ ప్రశ్నించారు.  ఉగ్రవాదంపై పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

జేఎన్‌యూలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చెయ్యడం  దిగజారుడు రాజకీయం అంటూ ఎద్దేవా చేశారు. ప్రతీకారం తీర్చరకోడానికి కాంగ్రెస్‌‌లా తాము భయపడమని …ఉగ్రవాదం ఎక్కడున్నా ఉపేక్షించబోమని చెప్పారు. దేశ భద్రత విషయంలో  బీజేపీ మాత్రమే సమర్థవంతంగా పనిచేయగలదని నేను ప్రజలకు తెలుపుతున్నాను అని అమిత్‌ షా అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu