రాహుల్ గాంధీకి మమత షాక్

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సిలిగురిలో ఆయన హెలికాప్టర్ దిగేందుకు అనుమతి నిరాకరించింది. ఈ నెల 14న ఇక్కడ జరిగే ఓ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించాల్సి ఉంది. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు డార్జిలింగ్ జిల్లా యంత్రాంగం రాహుల్ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంపై.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తృణమూల్ ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ తమ ప్రత్యర్థి […]

రాహుల్ గాంధీకి మమత షాక్
Follow us

| Edited By:

Updated on: Apr 13, 2019 | 7:08 PM

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సిలిగురిలో ఆయన హెలికాప్టర్ దిగేందుకు అనుమతి నిరాకరించింది. ఈ నెల 14న ఇక్కడ జరిగే ఓ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించాల్సి ఉంది. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు డార్జిలింగ్ జిల్లా యంత్రాంగం రాహుల్ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంపై.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తృణమూల్ ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ తమ ప్రత్యర్థి పార్టీ నేతలపై చౌకబారు విధానాలను అనుసరిస్తున్నారని దుయ్యబట్టింది.

డార్జిలింగ్ లోక్‌సభ అభ్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ మాలాకర్ మాట్లాడుతూ.. ‘‘ఓ పార్టీ అధ్యక్షుడు, స్టార్ క్యాంపైనర్ అయిన రాహుల్ గాంధీపై స్థానిక అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహించడం చూస్తుంటే… తృణమూల్, ఆపార్టీ చీఫ్‌ ఆయనకు ఎంత భయపడుతున్నారో తెలుస్తోంది. అందుకే తమ రాజకీయ ప్రత్యర్థులపై రాజ్యాంగ విరుద్ధమైన, చౌకబారు విధానాలను అవలంబిస్తోంది…’’ అని ఆరోపించారు. రాహుల్ గాంధీ కార్యక్రమం కోసం సకాలంలోనే తాము పత్రాలు సమర్పించినప్పటికీ… రాహుల్ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. బహిరంగ సభ జరిగే ప్రదేశానికి ఏప్రిల్ 7నే అనుమతులు మంజూరు అయినప్పటికీ.. రాహుల్ ప్రయాణానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.