చిన్న పదం.. సొంత పార్టీ నేతపై వైసీపీ ఫ్యాన్స్‌ ఫైర్..!

సీఎం వైఎస్ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు నుంచి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానంపై వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టునే ప్రధాన ప్రతిపక్షంగా మారిందంటూ వారు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు హైకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 49 మందికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:45 am, Thu, 28 May 20
చిన్న పదం.. సొంత పార్టీ నేతపై వైసీపీ ఫ్యాన్స్‌ ఫైర్..!

సీఎం వైఎస్ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు నుంచి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానంపై వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీ అభిమానులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టునే ప్రధాన ప్రతిపక్షంగా మారిందంటూ వారు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు హైకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 49 మందికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఓ ఛానెల్ చర్చలో పాల్గొన్న వైసీపీ నేత అద్దేపల్లి శ్రీధర్.. ఈ వివాదం తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.

దీనిపై మాట్లాడుతూ.. కోర్టు వ్యవహారాలపై తెలియక తప్పు చేశారంటూ వైసీపీ అభిమానులను అద్దేపల్లి వెనకేసుకునే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న 49 మందిలో 98శాతం ఇల్లిటరేట్స్‌ అని, వారికి మీడియా ముందు, సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలో, ఏం రాయాలో తెలీదని అన్నారు. దీనిపై వైసీపీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. తమనే ఇల్లిటరేట్స్ అంటారా..? అంటూ ఆయనపై ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో ఇప్పుడు సొంత పార్టీ అభిమానులకే సమాధానం ఇచ్చే పనిలో పడ్డారు అద్దేపల్లి.

Read This Story Also: హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు.. ఏడుగురిపై సీఐడీ కేసులు