ఎంపీ గల్లా జయదేవ్‌కు అవమానం..

గల్లా జయదేవ్‌.. మోస్ట్ పాపులర్ పార్లమెంట్‌మెంబర్. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. గొంతెత్తి తన గళాన్ని గట్టిగా వినిపించారు. ప్రధాన మంత్రిని సైతం మిస్టర్ ప్రైమ్‌ మినిస్టర్ అని సంబోధించిన వ్యక్తి, ఆయన. తాజా.. ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి విజయవంతంగా.. గెలుపొందారు. అలాంటి.. జయదేవ్‌కు స్థానికంగా.. ఓ అధికారి మాత్రం.. గౌరవం ఇవ్వడంలేదు. దీనిపై టీడీపీ వర్గాలు, గల్లా జయదేవ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు సమావేశాలకు.. తనను ఆహ్వానించకుండా.. ఆ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:07 am, Sat, 17 August 19
ఎంపీ గల్లా జయదేవ్‌కు అవమానం..

గల్లా జయదేవ్‌.. మోస్ట్ పాపులర్ పార్లమెంట్‌మెంబర్. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో.. గొంతెత్తి తన గళాన్ని గట్టిగా వినిపించారు. ప్రధాన మంత్రిని సైతం మిస్టర్ ప్రైమ్‌ మినిస్టర్ అని సంబోధించిన వ్యక్తి, ఆయన. తాజా.. ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి విజయవంతంగా.. గెలుపొందారు. అలాంటి.. జయదేవ్‌కు స్థానికంగా.. ఓ అధికారి మాత్రం.. గౌరవం ఇవ్వడంలేదు. దీనిపై టీడీపీ వర్గాలు, గల్లా జయదేవ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పలు సమావేశాలకు.. తనను ఆహ్వానించకుండా.. ఆ అధికారిప్రొటోకాల్‌ పాటించకపోవడంపై.. జయదేవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారితో మాట్లాడటానికి వెళ్లిన.. జయదేవ్‌ను చూసి కూడా.. ఆ అధికారి సరైన రీతిలో స్పందించలేదు. ఎంపీ మాట్లాడుతున్నప్పటికీ.. ఆయన తల వంచుకుని తన పని చేసుకుంటూ.. ఉన్నారు. దీంతో.. గల్లా జయదేవ్.. అతన్ని మందలించి.. అక్కడి నుంచి వచ్చేశారు. ఎంపీకి ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్‌ మర్యాదలు కూడా పాటించకపోవడంతో జయదేవ్ అసహనం వ్యక్తం చేశారు. ఎంత అధికారం మీదైతే.. ఎంపీకి కనీస మర్యాద ఇవ్వరా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పంథా మార్చుకోవాలని హితవు చెప్పారు ఎంపీ గల్లా జయదేవ్.