హత్యపై రాజకీయం.. విజయారెడ్డి కేసులో ఏంజరుగుతుందంటే ?

సొంత కార్యాలయంలోనే దారుణంగా పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఉదంతంలో మృత్యువాతకు గురైన ఎమ్మార్వో విజయారెడ్డి కేసు వెనుక రాజకీయాలున్నాయా ? రాజకీయ నేతలున్నారా ? ప్రస్తుతం ఓ మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న మాటల యుద్దం చూస్తే నిజమేననిపిస్తోంది. ఇబ్రహీంపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య కొనసాగుతున్న ఆరోపణల పర్వం విజయారెడ్డి హత్యోదంతాన్ని పీక్ లెవల్‌కు చేర్చింది. ఇబ్రహీంపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓ భూమి సెటిల్మెంట్‌లో భారీగా […]

హత్యపై రాజకీయం.. విజయారెడ్డి కేసులో ఏంజరుగుతుందంటే ?
Follow us

|

Updated on: Nov 06, 2019 | 7:37 PM

సొంత కార్యాలయంలోనే దారుణంగా పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఉదంతంలో మృత్యువాతకు గురైన ఎమ్మార్వో విజయారెడ్డి కేసు వెనుక రాజకీయాలున్నాయా ? రాజకీయ నేతలున్నారా ? ప్రస్తుతం ఓ మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న మాటల యుద్దం చూస్తే నిజమేననిపిస్తోంది. ఇబ్రహీంపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య కొనసాగుతున్న ఆరోపణల పర్వం విజయారెడ్డి హత్యోదంతాన్ని పీక్ లెవల్‌కు చేర్చింది.
ఇబ్రహీంపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఓ భూమి సెటిల్మెంట్‌లో భారీగా ముడుపులు తీసుకుని, అన్యాయానికి పాల్పడడం వల్లనే సురేశ్ ఈ దారుణానికి పాల్పడ్డాడన్నది మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణ. దీనిపై తీవ్రంగా స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఎదురు దాడికి దిగారు.
భూముల కొనుగోళ్లు, అక్రమాలకు బీజం పడింది మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంట్లోనే అన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే వాదన. శవరాజకీయాలు చేయడం తగదని కిషన్ రెడ్డి అంటున్నారు. తన చేతిలో మూడు సార్లు ఓడిపోయిన అక్కసులోనే రంగారెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు. తనను భూ కబ్జాదారుడు అనడంపై తీవ్రంగా అభ్యంతరపెట్టిన కిషన్ రెడ్డి.. దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని అంటున్నారు.
కిషన్ రెడ్డి వాదన ఏంటంటే ?
విజయారెడ్డి హత్యకేసులో ప్రధాన నింధితుడు సురేష్ తండ్రి కృష్ణ , పెదనాన్న దుర్గయ్య వద్ద కొత్తపల్లి జైపాల్ రెడ్డి , మల్రెడ్డి దివ్య భూములు కొనుగోలు చేశారు. వీరిలో మల్ రెడ్డి కావ్య కూడా వున్నారు. ఈ వ్యవహారంలో బాధితులు తన వద్దకు వస్తే తాను జెసికి రెఫర్ చేశానని కిషన్ రెడ్డి అంటున్నారు. మల్ రెడ్డి ఫ్యామిలీ ఎలాంటి పాస్ బుక్కులు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూ లావాదేవీలపై లోతుగా దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి కెసీఆర్‌కు, డిజిపి మహేందర్ రెడ్డికి లేఖ రాస్తున్నాను. మల్రెడ్డి రంగారెడ్డి , మల్రెడ్డి రామ్ రెడ్డి లు భూములు కబ్జా చేశారు. నాలుగు సర్వే నెంబర్ లలో 14 ఎకరాల భూమి భేదిరించి తమ వశం చేసుకున్నారు.
తాను 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు  వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కిషన్ రెడ్డి చెబుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, న్యాయ పరంగా చర్యలు తీసుకుంటానని, ఎమ్మార్వో కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకుందని కిషన్ రెడ్డి అంటున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి సోదరులతో పాటు ఇంకా అనేక మంది ఇందులో ఇన్వాల్ అయ్యారని ఆయన అంటున్నారు.
రంగారెడ్డి వాదనేంటంటే ?
కిషన్ రెడ్డి ఆరోపణలపై మల్‌రెడ్డి రంగారెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు. తన కుటుంబం ఎవరి భూములను కబ్జా చేయలేదని అన్నారు. చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్దమని ప్రకటించారాయన.  మంచిరెడ్డి భూబాగోతాలపై విచారణ జరపాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు. మొత్తమ్మీద అసలు కథ పక్కకుపోయి.. హత్యోదంతంపై రాజకీయం జోరందుకోవడం గమనార్హం.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??