కరోనాకు కారెవరూ అనర్హులు.. రాజకీయ నాయకుల భరతం పడుతున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు..

కరోనా మహమ్మారి సామాన్య ప్రజల తర్వాత ఎక్కువగా ప్రజలతో మమేకం అయ్యే రాజకీయ నాయకులను ఎక్కువగా

కరోనాకు కారెవరూ అనర్హులు.. రాజకీయ నాయకుల భరతం పడుతున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 5:38 AM

కరోనా మహమ్మారి సామాన్య ప్రజల తర్వాత ఎక్కువగా ప్రజలతో మమేకం అయ్యే రాజకీయ నాయకులను ఎక్కువగా పొట్టనపెట్టుకుంది. ఈ సంవత్సరం చాలామంది నేతలు కరోనా భారిన పడి చికిత్స పొందుతూ మృతిచెందారు. జనర‌ల్‌గా రాజకీయ నాయకులు వయసు పైబడి ఉంటారు కనుక తొందరగా వైరస్ భారిన పడి అర్ధాంతరంగా చనిపోయారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రముఖులు ఇలా అందరిని కలుపుకుపోయింది కరోనా. కొవిడ్ వల్ల మరణించిన కొంతమంది నేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

భారతదేశంలో కరోనాతో ఎంపీలు-03, ఎమ్మెల్యేలు-08 మంది చనిపోయారు. 17.09.2020 న రాజ్యసభ సభ్యుడు(బీజేపీ) అశోక్‌ గస్తీ, 16.09.2020న తిరుపతి లోక్‌సభ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ (వైఎస్ఆర్సీపీ), 28.08.2020న కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్‌ (కాంగ్రెస్) కరోనాతో మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్‌ క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు కరోనాతో మృతి చెందారు. 02.08.2020న కమల్‌ రాని వరుణ్‌,16.08.20202న చేతన్‌ చౌహాన్‌ కరోనాతో మృతి చెందారు.15-09-2020న మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోవర్దన్‌ డాంగీ, 17-08-2020న పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సమరేష్‌ దాస్, 24.06.2020న పశ్చిమబెంగాల్ తృణమూల్ ఎమ్మెల్యే తమొనాష్‌ ఘోష్‌,10-06-2020న తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే అంబజగన్‌, 31-10-2020న ఏఐడీఎంకే మంత్రి దొరైకన్ను, 29-11-2020న రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్వరి కరోనాతో మరణించారు.

వీరు కాకుండా కరోనాబారిన పడ్డ మరికొంతమంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ 25-11-2020న, అస్సోం మాజీ సీఎం తరుణ్‌ గోగోయ్‌ 23-11-2020న, కర్నాటక బీజేపీ నేత సురేష్‌ అంగడి 24-09-2020న, ఒడిషా బీజేడీ నేత ప్రదీప్‌ మహారథి 04-10-2020న, తమిళనాడు కాంగ్రెస్‌ నేత వసంతకుమార్‌ 28-10-2020న, ఏపీకి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు 1.08.2020న, ఢిల్లీ బీజేపీ నేత సంజయ్‌ శర్మ 11-06-2020న కరోనాతో మృతి చెందారు.