రాజధానిలో ర్యాలీల రగడ..రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఇదే!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. డిసెంబర్ 28న ర్యాలీలు, సభలు నిర్వహించుకుంటామని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతలు, ప్రజా రవాణా సమస్యలను సాకుగా చూపిన నగర పోలీసులు రెండు పార్టీల అభ్యర్థనలను తిరస్కరించారు. ఇది కాస్తా రాజకీయ రగడకు తెరలేపింది. టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా వున్న ఎంఐఎం పార్టీ ఎక్కడ సభ పెట్టుకోవాలన్నా కూడా విపరీతమైన రద్దీలో కూడా అనుమతిస్తున్న నగర […]

రాజధానిలో ర్యాలీల రగడ..రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఇదే!
Follow us

|

Updated on: Dec 27, 2019 | 4:52 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. డిసెంబర్ 28న ర్యాలీలు, సభలు నిర్వహించుకుంటామని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతలు, ప్రజా రవాణా సమస్యలను సాకుగా చూపిన నగర పోలీసులు రెండు పార్టీల అభ్యర్థనలను తిరస్కరించారు. ఇది కాస్తా రాజకీయ రగడకు తెరలేపింది.

టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా వున్న ఎంఐఎం పార్టీ ఎక్కడ సభ పెట్టుకోవాలన్నా కూడా విపరీతమైన రద్దీలో కూడా అనుమతిస్తున్న నగర పోలీసులు.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి, కేంద్ర,రాష్ట్రాలలో ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ పార్టీలకు మాత్రం అనుమతివ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో భారీ సభను నిర్వహించిన ఎంఐఎం పార్టీ.. శుక్రవారం నిజామాబాద్‌లో కూడా భారీ సభను పూర్తి చేసింది.

నిజానికి దేశవ్యాప్తంగా రగులుతున్న ఎన్నార్సీ, సీఏఏ అంశాలపై సేవ్ కాన్స్టిట్యూషన్ పేరిట నగరంలో బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అందుకు పోలీసుల అనుమతి కోరారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే సమయంలో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరి ఎన్టీఆర్ స్టేడియంలో సీఏఏ అనుకూల సభకు అనుమతి కోరారు బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. పోటాపోటీగా సభలను నిర్వహించేందుకు సిద్దమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు షాకిచ్చారు తెలంగాణ పోలీసులు. ఇద్దరి అభ్యర్థనలను తోసిపుచ్చారు. పర్మిషన్ తిరస్కరించారు.

పోలీసుల నిర్ణయంతో అటు రాజాసింగ్, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి భగ్గుమన్నారు. రేపు కాకపోతే డిసెంబర్ 30న ఇందిరాపార్క్ వద్ద సీఏఏ అనుకూల సభ నిర్వహిస్తామని ప్రకటించారు రాజాసింగ్. పోలీసులు అనుమతించకపోయినా సభను నిర్వహించి తీరతామన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సభ నిర్వహిస్తే దాన్ని పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారాయన.

మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. ఆర్.ఎస్.ఎస్.కు భారీ ర్యాలీకి అనుమతించిన పోలీసులు.. తమకెందుకు అనుమతినివ్వరిన ప్రశ్నించారాయన. పోలీసులతో పాటు ఆర్.ఎస్.ఎస్. పై కూడా నిప్పులు చెరిగారు ఉత్తమ్. ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు కర్రలతో నగరంలో భయోత్పాతాన్ని సృష్టించారని ఆరోపించారు. ఏదో ఓ మూలన అనుమతించినా సేవ్ కాన్స్టిట్యూషన్ పేరిట సభ నిర్వహించుకుంటామని కోరారు. సేవ్ కాన్స్టిట్యూషన్ ర్యాలీకి పోలీసులు అనుమతి తిరస్కరించడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేరు మార్చేశారు. తిరంగా ర్యాలీని అనుమతివ్వాలని కోరుతూ మరో అప్లికేషన్ పెట్టారు భట్టి. సో.. హైదరాబాద్ ర్యాలీలు.. వాటి చుట్టూ రాజకీయ రగడతో మార్మోగిపోతోంది.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!