Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

అసలు ఈ తెలంగాణ మంత్రులకేమైంది..?

Political Mirchi : What Happens to Telangana Ministers..?, అసలు ఈ  తెలంగాణ మంత్రులకేమైంది..?

వాళ్లంతా మంత్రులు.. రాష్ట్రంలో ఎక్కడైన పర్యటించేయోచ్చు. కాదు కాదు.. పర్యటించడం వారి బాధ్యత. అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే. వారికి కేటియించిన శాఖల పనితీరును సమీక్షించాల్సి ఉంటుంది. కానీ ఈ పని ఎక్కడా కూడా జరగడం లేదు. వారంతా వారి సొంత పనులకు మాత్రమే పరిమితమవుతున్నారు. కనీసం పక్క సీటు వైపు కూడా కన్నెత్తి చూడడం లేదు. అసలు వీరికేమైంది. ఎందుకు ఇలా చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పడిన చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరింది. మొదట్లో మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో.. అంతా వేయికళ్లతో వేచిచూశారు. ఎవర్ని ఈ పదవులు వరిస్తాయో అని. అయితే ఇటీవల పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణలో అన్ని శాఖలకు మంత్రులు వచ్చారు. తమ శాఖలకు సంబంధించిన పనులు చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. అంతేకాదు తమ వీరు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉంది. ఏ నియోజకవర్గానికైనా వెళ్లి పర్యటించే అధికారం ఉంది. అయితే కొందరు మంత్రులు మాత్రం వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. అంతేకాదు అసలు ఈ మంత్రులకు ఏమైంది.. అన్ని జిల్లాల్లో ఎందుకు పర్యటించడం లేదు.. ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే చర్చ కూడా జరుగుతోంది.

అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు వల్లే కొందరు మంత్రులు ఇతర నియోజకవర్గాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. మొన్నీమధ్య ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ మంత్రి.. పక్కనే ఉన్న నియోజకవర్గానికి తరుచూ వెళుతుంటే.. మంత్రి రాకను జీర్ణించుకోని ఆ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారట. తన కోపాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు గన్‌మెన్లను వెనక్కికి పంపించారట. అంతేకాకుండా పార్టీ నేతలకు అందుబాటులోకి రాకుండా అలకబూనారట. దీంతో ఆ జిల్లా మంత్రి అటు వైపు వెళ్లడం మానేశారని తెలుస్తోంది.

ఇక హైదరాబాద్‌కు చెందిన మంత్రుల పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి తన కొడుకు, అల్లుడు భవిష్యత్ కోసం సిటీ లోని నియోజకవర్గాల్లో జోరుగా టూర్లు వేస్తున్నారట. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు మంత్రిగారి పర్యటనలకు బ్రేక్‌లు వేశారట. దీంతో చేసేదేంలేక.. ఆ మంత్రి తన సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇక సికింద్రాబాద్ మంత్రిగా పేరుపొందిన నేత కూడా వేరే జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారట. కానీ సిటీలో మాత్రం వేరే నియోజకవర్గాలపై పెద్దగా చూడడం లేదు. ఇందుకు కారణం.. మాజీ మంత్రి, మేయర్‌తో వచ్చిన గ్యాప్‌ వల్లే అని ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ మంత్రి పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది. తన జిల్లా తన నియోజకవర్గం తప్ప ఎటూ వెళ్లడంలేదంటా. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మినహా మిగతా మంత్రులు ఎవ్వరు కూడా వేరే జిల్లాలో అడుగుపెట్టాడానికి సాహసం చెయ్యడం లేదట.

అయితే సాధారణంగా మంత్రి హోదాలో రాష్ట్రంలో ఎక్కడ అయిన పర్యటించే అధికారాలు మంత్రులకు ఉంటాయి. కానీ ఎమ్మెల్యేల నుండి సహకారం లేకపోవడం..తామ టూర్లతో వారు అసంతృప్తికి గురికావడం ఎందుకులే అని కొందరు మంత్రులు వారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారట.

Related Tags