టీ పీసీసీ చీఫ్ రేసులో ఆ ఇద్దరు…?

Political Mirchi: Two compete for Telangana Chief post, టీ పీసీసీ చీఫ్ రేసులో ఆ ఇద్దరు…?

తెలంగాణలో పీసీసీకి కొత్త సారథి ఎవరిని పెట్టాలనే దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారట హైకమాండ్ పెద్దలు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతోనే మార్పు చేయాలనే ఆలోచన చేశారట. అయితే కొంత టైం తీసుకుందాం అనేలోపే ఇటు రాహుల్ రాజీనామాతో తెలంగాణలో పీసీసీ కీలక నేతలంతా తమ పదవులకు రాజీనామా చేశారు.

దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పీసీసీ నేతలంతా రాజీనామాలు చేశారు. ఇదే అదునుగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉన్నారట ఢిల్లీ హస్తం నేతలు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ చేస్తున్నారట పీసీసీ నేతలు.

ఇటు ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలంతా పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి మాటకారితోనే పార్టీ మనుగడ సాగిస్తుందని..అదే టైంలో గులాబీ నేతలకు ధీటుగా నిలపడతారనే మాటను హై కమాండ్ కు చెబుతున్నారట రేవంత్ వర్గం నేతలు.

మరో వైపు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే పనిలో బిజీ అయ్యారట సీనియర్ నేతలు. తమను నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ కు పార్టీలో పెద్ద పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు ఓటుకు నోటు కేసు విషయాన్ని గుర్తు చేస్తూ హై కమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లే పనిలో బిజీగా ఉన్నారట.

అయితే హైకమాండ్ నేతలు మాత్రం…బలమైన నేతకే పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు బాగా ప్రచారంలో ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *