Breaking News
  • డిసెంబర్‌ 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం. డిసెంబర్‌ 9న బీఏసీ సమావేశం.
  • అమరావతి: వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్‌ సమావేశం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది-జగన్‌. గత ప్రభుత్వం రూ.40వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడంపై దృష్టిపెట్టాం-సీఎం జగన్‌. అనవసర ఖర్చులు తగ్గించడంపై అధికారులు దృష్టిపెట్టాలి. ప్రాధాన్యత అంశాలపై దృష్టిపెట్టి ముందుకెళ్లాలి-సీఎం. నవరత్నాల అమలే ప్రభుత్వానికి ఉన్న ఫోకస్‌-సీఎం జగ.న్‌. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులను తెచ్చుకోవాలి. జిల్లాల పర్యటనల్లో నేను ఇచ్చే హమీల అమలు దృష్టిపెట్టాలి-జగన్‌.
  • చిత్తూరు: విద్యాశాఖ పదోన్నతులపై ఆర్‌జేడీ విచారణ. భాషా పండితుల పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు. అనర్హులకు పదోన్నతులు కల్పించారని కమిషనర్‌కు ఫిర్యాదు. ఉపాధ్యాయుల ఫిర్యాదుతో కొనసాగుతున్న ఆర్‌జేడీ విచారణ.
  • ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు. హైదరాబాద్‌ మార్కెట్లో ఉల్లి ధర రికార్డు. రూ.100కు చేరువలో కిలో ఉల్లిధర. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.97. మూడేళ్ల క్రితం రూ.70 పలికిన కిలో ఉల్లిధర.
  • రాజధానిపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు-లోకేష్‌. రాజధాని విషయంలో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. పార్టీ వీడినవారు చంద్రబాబును ఏమీచేయలేక నాపై విమర్శలు చేస్తున్నారు . రాజధాని భూముల విషయంలో నాపై ఆరోపణలు నిరూపించలేకపోయారు. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా-నారా లోకేష్.
  • ఛత్తీస్‌గఢ్‌: దంతేవాడ జిల్లాలో పేలిన మందుపాతర. రోడ్డు పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలు. బార్సూర్‌-నారాయణ్‌పూర్‌ మార్గంలో పేలిన మందుపాతర.
  • ఇంగ్లీష్‌ను తామే పరిచయం చేస్తున్నట్టు సీఎం మాట్లాడుతున్నారు. భాషను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న పార్టీ వైసీపీ-బోండా ఉమ. ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలు ఉండాలని 2016-17లో జీవోలు ఇచ్చాం. 1 నుంచి టెన్త్‌ వరకు ఇంగ్లీష్‌ ఉండాలని జీవో 14 ఇచ్చింది చంద్రబాబే. విద్యావ్యవస్థలో మార్పుపై అసెంబ్లీలో చర్చకు టీడీపీసిద్ధం-బోండా ఉమ. టీడీపీ నుంచి వేరే పార్టీకి వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒకరిద్దరు స్క్రాప్ మాత్రమే టీడీపీ నుంచి వెళ్లిపోయారు-బోండా ఉమ.
  • డిసెంబర్‌ 9 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం. డిసెంబర్‌ 9న బీఏసీ సమావేశం.

పొలిటికల్ మిర్చి: టీటీడీలోకి రమణ దీక్షితుల రీ ఎంట్రీ కన్ఫామా..?

Political Mirchi: Ramana Dikshitha's re-entry Confirm in TTD, పొలిటికల్ మిర్చి: టీటీడీలోకి రమణ దీక్షితుల రీ ఎంట్రీ కన్ఫామా..?

ఆయనకు లైన్‌ క్లియర్‌ అయింది. కానీ ఇంకో మెలిక పడింది. ఆయన కొండపై రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఇప్పుడో ఓ కమిటీ క్లియరెన్స్‌ ఇవ్వాలి. ఆయన్ని తీసుకోవాలా? లేదా అనే పాయింట్‌ తేల్చాలి. దీంతో ఆయన ఏడు కొండలపై కనిపించాలంటే మరింత టైమ్ పట్టేలా ఉంది.

టీటీడీ ప్రధానార్చక పదవి తొలగించబడ్డ రమణ దీక్షితులు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు సానుకూల వాతావరణం ఏర్పడింది. టీటీడీలో మళ్లీ ఆయన రీ ఎంట్రీకి పాజిటివ్‌ వెదర్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆయన తిరిగి టీటీడీలోకి రావడం ఖాయమని అనుకున్నారు. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ఉత్తర్వులు అడ్డంకులుగా మారాయి. అవి ఇప్పుడు తొలిగిపోయి రమణ దీక్షితులు తిరిగి తిరుమలలో అడుగు పెడతారని తెలుస్తోంది.

గతంలో టీటీడీలో జరిగే పరిణామాలపై ఆరోప‌ణ‌లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు ర‌మ‌ణ దీక్షితులు. పలు వివాదాలను ఆయన రేపడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. ప్రధాన అర్చకుల హోదా నుంచి తొలగించారు. అర్చకులకు వయో పరిమితి విధించిన ఆయన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు జగన్‌ సర్కార్‌ అర్చకుల వంశపారంపర్య హక్కులను మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ ధర్మదాయ చట్టం 1987లోని సవరణలు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. వంశపారంపర్య హక్కుల వల్ల అర్చకులకు పదవీ విరమణ ఉండదని తెలిపింది. అయితే ఈ జీవో టీటీడీకి మినహాయింపు ఇచ్చింది.ఈ జీవో సోమవారం విడుదలైంది. ఇప్పుడు ఈ జీవోను బుధవారం సమావేశమైన టీటీడీ పాలకమండలి కూడా ఆమోదించింది. దీంతో టీటీడీలో రమణదీక్షితుల ఎంట్రీకి లైన్‌ క్లియర్‌ అయిందని అనుకున్నారు. అయితే ఇక్కడో మెలిక కూడా బోర్డు పెట్టినట్లు తెలుస్తోంది. రిటైర్డ్‌ ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలో తీసుకోవడంతో పాటు…పాత పోస్టులో తీసుకోవాలనే విషయంపై ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ రమణ దీక్షితుల రీ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాతే రమణదీక్షితులు రీ ఎంట్రీపై టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.