Breaking News
  • చిత్తూరు: మదనపల్లెలో మహిళా సంఘాల ఆందోళన. నిందితుడిని ఉరి తీయాలంటూ చిన్నారి వర్షిత తల్లిదండ్రుల ధర్నా. తమకు న్యాయం చేయాలంటున్న వర్షిత తల్లిదండ్రులు. రఫీని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్. విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వర్షిత కుటుంబ సభ్యులు. కిందకు దించేందుకు పోలీసుల ప్రయత్నాలు.
  • వివాదంలో జార్జిరెడ్డి సినిమా. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపణ. సినిమాలో జార్జిరెడ్డి రౌడీయిజాన్ని చూపెట్టాలన్న ఏబీవీపీ. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు. ఈ నెల 22న విడుదల కానున్న జార్జిరెడ్డి.
  • వరంగల్‌: ఏనుమాముల మార్కెట్ యార్ట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వ హామీతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించిన కాటన్ వ్యాపారులు.
  • ఢిల్లీ చేరుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. సా.4గంటలకు సోనియాతో భేటీ కానున్న శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • హైదరాబాద్‌: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ. తాకట్టు పెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లు. సంవత్సరం గడిచినా కొనుగోలుదారులకు అందని కన్‌ఫర్మేషన్‌ ఆర్డర్. కన్‌ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరిన బ్యాంకర్లు. డిసెంబర్‌ 5న మరోసారి విచారిస్తామన్న హైకోర్టు. తదుపరి విచారణ డిసెంబర్‌ 5కు వాయిదా.
  • లోక్‌సభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు. ప్రాంతీయ భాషా పరిరక్షణపై కేశినేని నాని ప్రశ్న. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలి-కేశినేని నాని. ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది-కేశినేని నాని. పలు అంశాలపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతున్న సభ. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నాం-మంత్రి పోఖ్రియాల్‌.
  • ఆగ్రా జిల్లా పేరు మార్చే యోచనలో యూపీ సర్కార్. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యూపీ సర్కార్‌ యోచన. కాషాయికరణలో భాగంగా పేరు మారుస్తున్నారని విపక్షాల విమర్శలు. గతంలో ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన యూపీ సర్కార్.

కమలం వైపు చూస్తున్న కొండా దంపతులు

కొండా దంపతులు కొంతకాలంగా పొలిటికల్‌గా సైలంట్ అయిపోయారు. జరుగుతోన్న రాజకీయాన్ని చూడటం తప్ప.. తమదైన పాత్ర పోషించే అవకాశం రాక అల్లాడుతున్నారట. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు కొండా దంపతులు. కానీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మెల్లి మెల్లిగా తమ ప్రభావాన్ని కోల్పోతూ వచ్చారు. 2014కి ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కారెక్కి.. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి విజయంసాధించారు. అటు కొండా మురళికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది టీఆర్ఎస్ అధిష్టానం. 2019 ఎన్నికల వేళ తన కుంటుంబానికి రెండు టికెట్లు కావాలని కొండా సురేఖ తేల్చి చెప్పడంతో.. ఒకటి కూడా లేదనేసింది టీఆర్ఎస్ అధిష్టానం. ఆ తర్వాత పార్టీ హైకమాండ్‌కి డెడ్‌లైన్ వార్నింగ్ ఇస్తూ.. రసవత్తర ఘట్టానికి తెర తీసే ప్రయత్నం చేశారు కొండా దంపతులు. కానీ.. ఆ ఎపిసోడ్ రక్తికట్టలేదు. పొమ్మనేదాకా పరిస్థితి రావడంతో ఒక్కసారిగా సొంతగూడు గుర్తొచ్చింది. గులాబీ కండువాలు తీసేసి కాంగ్రెస్ కండువాలు వేసేసుకున్నారు.

లాస్ట్ మినిట్‌లో పార్ట మారి పరకాల టిక్కెట్టు సాధించి.. కాంగ్రెస్ నుంచి బరిలొకి దిగారు కొండా సురేఖ. కానీ.. కారు స్పీడ్‌కి తెలంగాణలో మహాకూటమి ఘోర పరాజయం పాలైంది. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కొండ సురేఖ కూడా చేరారు. నాటి నుంచి కొండా దంపతులు పొలిటికల్‌గా మరింత వీక్ అయ్యారట. కాంగ్రెస్‌లో ఉంటే ఇక కష్టం అనుకుంటున్న వాళ్లంతా కారెక్కడం మొదలుపెట్టారు. కానీ కొండా దంపతులకి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ హైకమాండ్‌తో ఘర్షణ పడి.. సవాళ్లు విసిరి కారు దిగిపోయారు. ఇక మిగిలిన ఆప్షన్ బీజేపీ మాత్రమే. దీంతో ఇప్పుడు కొండా దంపతులు కమలనాథులుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోందట.

అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెల్చుకున్న బీజేపీ.. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలను గెల్చుకుని సంచలనం సృష్టించింది. మరోవైపు డీఎస్ తనయుడు అరవింద్ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెల్చారు. డీఎస్ కూడా బీజేపీకి దగ్గరగా జరుగుతున్నారు. కొండా దంపతులది కూడా అదే సామాజికవర్గం. కాంగ్రెస్‌లో ఉన్న వేళ డీఎస్‌తో మంచి సంబంధాలున్నాయి. ఇప్పుడు బీజేపీలో చేరితే తిరిగి పూర్వవైభవం సాధించవచ్చని కొండా దంపతులు భావిస్తున్నారట. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి టిక్కెట్టు ఇవ్వాలని కొండా సురేఖ షరతు పెడుతున్నారట. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబెల్‌గా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ కూడా ఇదే షరతుపై బీజేపీ వైపు చూస్తున్నారట. దీంతో.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ భూపాలపల్లి టికెట్టు హామీ లభిస్తే కొండా దంపతులు కాషాయ కండువాలు వేసుకోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోందట.