పొలిటికల్ మిర్చి: ఆది మీటింగ్ అందుకేనా..?

Political Mirchi: Former minister Adinarayana Reddy Read to Joins BJP?, పొలిటికల్ మిర్చి: ఆది మీటింగ్ అందుకేనా..?

ఆయన ఓ క్లారిటీ ఉన్న పొలిటీషియన్. జనాన్ని కన్ ఫ్యూజన్ చేయడంలో మాస్టర్ డిగ్రీ ఆయన సొంతం. పార్టీలు మారడం, గ్రూపులు ఛేంజ్ కావడంలో ఏమాత్రం మొహమాట పడరు. అందులోనూ ఇప్పుడు వలసల సీజన్ కూడా మొదలైంది.. దాంతో మళ్లీ జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగానే ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవడం.. మంతనాలు జరపడం కూడా అయిపోయింది. ఇక జంప్ చెయ్యడానికి ముహూర్తం ఖరారు కావడమే తరువాయి అనుకున్నారు అందరూ. కట్ చేస్తే… రెండు రోజుల క్రితం ఆదినారాయణ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. దాంతో వీరిద్దరి భేటీ కార్యకర్తలో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.

చంద్రబాబును ఆది కలవడం వెనుక వేరే కారణాలున్నాయని ఆది అనుచర వర్గం చెబుతోంది. ఎన్నికల టైంలో తనకు ఇచ్చిన హామీలను అడిగేందుకే వెళ్ళారంటోంది. చంద్రబాబును కలిసిన ఆది… గెలవలేమని తెలిసికూడా తనను ఎంపీ అభ్యర్ధిగా నిలపడంతో తనకు అన్యాయం జరిగిందని అధినేత వద్ద వాపోయారట. రామసుబ్బారెడ్డితో రాజీ విషయాను కూడా ప్రస్తావిస్తూ ఎన్నికల ముందు వేసిన తప్పటడుగులను గుర్తు చేశారట.

దాంతో చంద్రబాబు ఆయనను పార్టీలో కొనసాగాలని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారట. అయితే, ఆది మాత్రం జగన్ తనను టార్గెట్ చేయడం ఖాయమని, అందుకే తాను బీజేపీలో చేరాలనుకుంటున్నానని చంద్రబాబుకు చెప్పారట. దీంతో ఆది జంప్ ఖాయమని అనుకుంటున్నారు అందరూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *