అయ్యో పాపం అఖిల ప్రియ..

భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి భూమా ఫ్యామిలీ రాజకీయ వారసురాలు. అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి భూమా ఫ్యామిలీ మార్కు చూపే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు ఆళ్లగడ్డలో అంతా ఆమెదే రాజ్యం..అయితే ఎన్నికల తర్వాత సీన్ మారింది. టీడీపీ ఓటమితో అఖిల ప్రియ సైలెంట్ అయ్యారు. అంతే కాదు వైసీపీలో చేరేందుకు ట్రైచేసినా వర్క్ అవుట్ కాలేదు. ఇక రాజకీయంగా ప్రత్యర్థుల పోరుకు రెడీ అవుతున్న తరుణంలోనే ఇంటి పోరు మొదలైందట […]

అయ్యో పాపం అఖిల ప్రియ..
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 9:59 PM

భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి భూమా ఫ్యామిలీ రాజకీయ వారసురాలు. అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి భూమా ఫ్యామిలీ మార్కు చూపే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు ఆళ్లగడ్డలో అంతా ఆమెదే రాజ్యం..అయితే ఎన్నికల తర్వాత సీన్ మారింది. టీడీపీ ఓటమితో అఖిల ప్రియ సైలెంట్ అయ్యారు. అంతే కాదు వైసీపీలో చేరేందుకు ట్రైచేసినా వర్క్ అవుట్ కాలేదు. ఇక రాజకీయంగా ప్రత్యర్థుల పోరుకు రెడీ అవుతున్న తరుణంలోనే ఇంటి పోరు మొదలైందట అఖిల ప్రియకు…

భూమా దంపతులు చనిపోయిన తర్వాత ఆయన అభిమానులంతా అఖిలప్రియకు అండగా నిలిచారు. ఇటు భూమా కుటుంబ సభ్యులు కూడా అఖిలప్రియను సపోర్ట్ చేశారు. పవర్ చేతిలో ఉన్నప్పుడు అంతా అండగా ఉన్నఒటమి తర్వాత ఒంటరిని చేస్తున్నారట. ఇప్పుడు ఎమ్మెల్యే లేక..మంత్రి పదవి లేక..పార్టీ పవర్ లో లేక..నా అనుకున్న వాళ్లే వదిలేసి పక్క పార్టీల్లో చేరుతుండటంతో ఒంటరయ్యారు మాజీ మంత్రి అఖిల ప్రియ.

ఇటీవలే అఖిలకు బీజేపీలో చేరేందుకు ఆఫర్ వచ్చింది..చూద్దాంలే అనుకునేలోపే భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరి అఖిలకు షాకిచ్చాడు. అంతేకాదు భూమా ఫ్యామిలీ నుంచి ఇంకా చేరికలుంటాయనే టాక్ ఆమెను మరింత భయపెడుతోంది. భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అదే లైన్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. నిన్నమొన్నటి తనతో ఉన్నఅన్నళ్లే ఫ్యూచర్ లో ప్రత్యర్థులుగా మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇదంతా భూమా ఫ్యామిలీకి అత్యంత ఆఫ్తుడుగా ఉన్న ఏవీసుబ్బారెడ్డినే చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. సుబ్బారెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందట. ఇదంతా చూసి అయ్యో పాపం అఖిల ప్రియఅని అనుకుంటున్నారట ఆమె అభిమానులు.