Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

చంద్రబాబును టెన్షన్ పెడుతున్న ఆ జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు..?

Political Mirchi : About Prakasham District TDP Mla's, చంద్రబాబును టెన్షన్ పెడుతున్న ఆ జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు..?

తెలుగుదేశం పార్టీ అధినేతకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం చవిచూసిన తర్వాత.. రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన విషయం తెలిసిందే. అయితే అదంతా చంద్రబాబు డైరక్షన్‌లోనే జరిగిందంటూ వార్తలు వచ్చాయి. పైగా చంద్రబాబు కూడా వారి చేరికపై పెద్ద ఎత్తున స్పందించలేదు కూడా. అయితే తాజాగా..పార్టీలో నెలకొన్న పరిస్థితులు చంద్రబాబును కలవరపెడుతున్నాయట. దానికి కారణం పార్టీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటమేనట. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరితో విందు రాజకీయం.. అధినేతను టెన్షన్‌కు గురిచేస్తున్న అంశాలే. అయితే తాజాగా ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు.. టిడిపి అధిష్టానం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో చంద్రబాబే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి.. జిల్లాలోని నలుగురు టిడిపి ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి మాట్లాడటం తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది.

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. చీరాలలో కరణం బలరాం, కొండెపిలో బాలవీరాంజనేయస్వామి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. అయితే ఈ నలుగురు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనటం లేదు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు తెలిపింది. అయితే ప్రకాశం జిల్లాలో జరిగిన టీడీపీ నిరసన కార్యక్రమాల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేల జాడేలేదు. రాష్ట్రం అంతా టీడీపీ శ్రేణులు ఇసుక విధానంపై ఆందోళన చేస్తుంటే, అదే సమయంలో కరణం బలరామ్ బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. అంతేకాదు.. కరణంబలరాంను కమలం గూటికి చేరమంటూ.. సుజనా ఎప్పటి నుండో అడుగుతున్నారట. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటి పార్టీలో కలకలం రేపుతోంది.
అయితే ఈ విషయాలన్నింటినీ గమనించిన చంద్రబాబు చీరాల, పర్చూరు, కొండెపి ఎమ్మెల్యేలతో విడివిడిగా చాలాసేపు ఫోన్లో మాట్లడారట. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో చంద్రబాబులో మరింత టెన్షన్ పెరిగిపోయిందట. అయితే ఆ తర్వాత చంద్రబాబును గొట్టిపాటి విజయవాడలో నేరుగా కలిశారట. అయితే ఈ మీటింగ్‌లో ఏం చర్చ జరిగిందనేది మాత్రం బయటకు రాలేదు.

ఇక గన్నవరం ఎమ్మెల్యే.. వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్‌తో టీడీపీ పార్టీలో ఉండేదెవరో…వెళ్ళిపోయేదెవరో అర్ధంకాక అధినేత చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతోందట. ఈ నేపథ్యంలోనే ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారట. మొత్తానికి పార్టీలో ఉన్న23 మంది ఎమ్మెల్యేలు ఉండెదెవరు? ఊడెదెవరు అనేది మరికొన్ని రోజుల్లో ఓ క్లారిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.