‘పింగళి వెంకయ్య’ సేవలు మరవలేనివి..!

Political Leaders Tweet on Pingali Venkayya Birthday Anniversary, ‘పింగళి వెంకయ్య’ సేవలు మరవలేనివి..!

జాతీయపతాక రూపకర్త.. ఫ్రీడమ్ ఫైటర్.. గాంధీకాలం నాటి నాయకులు.. ఆంగ్లేయులకు అరాచకాలకు బలైన వ్యక్తి పింగళి వెంకయ్య. ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ సహా చంద్రబాబు పలువురు నేతలు ట్వీట్లు చేస్తున్నారు.

పింగళి వెంకయ్య సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని అని అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. గాంధీకాలం నాటి ఆయన ఫ్రీడమ్ ఫైటర్‌గా చాలా పోరాటాలు చేశారని.. గుర్తుచేశారు జగన్.

భారతదేశానికి జాతీయపతాకాన్ని అందించిన గౌరవం తెలుగువారికి దక్కించిన మహనీయులు పింగళి వెంకయ్యగారు అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. వందేమాతరం, హోమ్‌రూల్ వంటి ఉద్యమాలలో పింగళిగారి పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శనీయం. ఈ రోజు పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ దేశభక్తుని స్మృతికి నివాళులర్పిద్దామని ట్వీట్‌లో పేర్కొన్నారు చంద్రబాబు.

తెలుగువెలుగు, జాతీయపతాక రూపకర్త, స్వాతంత్య్ర పోరాటధీరులైన పింగళి వెంకయ్యగారు వ్యవసాయ, భూగర్భ శాస్త్ర పరిశోధనలలో సైతం ఎంతో కృషిచేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా దేశానికి సేవలందించారు. ఈరోజు పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని దేశసేవను స్మరించుకుందామని ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *