రాజకీయ హత్యలు ఆగాల్సిందే, మమతకు బెంగాల్ గవర్నర్ హితవు, దీటుగా స్పందించిన దీదీ

పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ జగ  దీప్ ధన్ కర్ . సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ బయటపడ్డాయి. రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని..

  • Umakanth Rao
  • Publish Date - 9:03 pm, Wed, 18 November 20
రాజకీయ హత్యలు ఆగాల్సిందే, మమతకు బెంగాల్ గవర్నర్ హితవు, దీటుగా స్పందించిన దీదీ

పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ జగ  దీప్ ధన్ కర్ . సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ బయటపడ్డాయి. రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని  తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్ ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయ హత్యలు, హింసను ఆపాలని,వీటిని తాను సహించబోనని ఆయన అన్నారు. అయితే దీదీ ఆయనకు గట్టి సమాధానమే ఇఛ్చారు. ఎన్నికలకు ముందు శాంతిభద్రతలను దిగ జార్చేందుకు బయటి గూండాలను తెస్తున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఆమె అన్నారు. బుధవారం కూచ్ బీహార్ జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్తను కొందరు కొట్టి చంపిన ఘటనపై గవర్నర్ సీఎం ను ప్రశ్నించగా ఆమె ఈ సమాధానమిచ్చారు. ఎదుటి పార్టీ నేతలు కూడా తక్కువైనవారేమీ కారని ఆమె పేర్కొన్నారు.