Breaking News
  • ఢిల్లీ: ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌ల గడువు పొడిగింపు . 2019-20 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌ల దాఖలకు గడువు పెంపు . పన్ను రిటర్న్‌లకు 2021 జనవరి 31 గడువు పెంపు . ప్రకటించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ . కోవిడ్‌-19 నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం .
  • విజయవాడ: ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న కిషన్‌రెడ్డి . స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర నాయకులు . హైందవి కార్యాలయంలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి . రాత్రికి హోటల్లో బస..రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న మంత్రి . తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి పయనం .
  • కరోనా బాధితులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లతో చంద్రబాబు వెబినార్‌. కరోనా ఉధృతిపై రోజువారీ ఆడిట్‌ చేసుకోవాలి . సమర్థవంతంగా హ్యాండిల్‌ చేయగలిగేవారే సంక్షోభం అధిగమించగలరు . కరోనా కష్టకాలంలో మనవంతు బాధ్యతలను నిర్వహిస్తున్నాం. కేసుల సంఖ్యలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది . మరణాల సంఖ్యలో దేశంలోనే ఏపీది 5వ స్థానం . దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 30 జిల్లాల్లో 5 జిల్లాలు ఏపీవే .
  • మెదక్‌ జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో విషాదం . ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి. పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో ఘటన . బతుకమ్మను చెరువులో వదిలేందుకు వెళ్లి మునిగిన యువకుడు .
  • అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త . డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌. 2018 జూలై నుంచి 2019 డిసెంబర్‌ వరకు పెండింగ్‌లో ఉన్న.. మూడు డీఏల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌. కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్‌ నెల.. సగం జీతాలను 5 విడదల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం .
  • జమ్మూకశ్మీర్‌: గుపాకర్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లా. పేరును ప్రతిపాదించిన మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఆర్టికల్‌ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఫ్తీ. కేంద్రం తీరును నిరసిస్తూ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు .
  • ఢిల్లీ:దేశ ప్రజలకు విజయదశిమి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి . చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయదశిమి . కోవిడ్‌ నిబంధనలకు లోబడి పండుగను జరుపుకోవాలి-వెంకయ్యనాయుడు .

నిధుల కోసం కేంద్రంపై పోరాటం

కరోనాతో కుదేలైపోయిన ఆర్థిక పరిస్థితిని కుదురుకునేలా చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఒకవైపు స్థానికంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ...

political fight for central funds, నిధుల కోసం కేంద్రంపై పోరాటం

కరోనాతో కుదేలైపోయిన ఆర్థిక పరిస్థితిని కుదురుకునేలా చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఒకవైపు స్థానికంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే కేంద్రం నుంచి వీలైనంతగా సాయం పొందేందుకు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పలు వినతులను అందజేయగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి సాయం కోసం అభ్యర్థనలు మొదలు పెట్టింది.

ప్రభుత్వాల తరపున కేంద్రాన్ని కోరడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నాలు ముమ్మరం చేశాయి. పార్లమెంటులో సందర్భం వచ్చినపుడల్లా అటు ఏపీ అధికార పార్టీ వైసీపీ, ఇటు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్… కేంద్రానికి మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు తరచూ వినతులను సమర్పిస్తూనే వున్నారు. తాజాగా రాజ్యసభలో ప్రసంగించిన కొత్త ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. రాష్ట్ర విభజన అప్పట్నించి ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న ఏపీని కరోనా తాకిడి మరింతగా దెబ్బకొట్టిందని, లోన్ల రూపంలో కాకుండా గ్రాంట్ల రూపంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉండటం, కోవిడ్-19 ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని మోపిదేవి తెలిపారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ముందుండి, విదేశీ మారక ద్రవ్యాన్ని సమపార్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వివరించారు. అయితే.. తాజాగా జీఎస్టీ వసూళ్ళు దారుణంగా పడిపోవడంతో రాష్ట్రం ఇబ్బందుల పాలైందని ఆయన తెలిపారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఒకింత ఘాటైన విమర్శలతో కేంద్రంపై విరుచుకుపడ్డారు. జీఎస్టీ లోటును కేంద్రం నేరుగా పూడ్చకుండా.. లోన్ల పరిమితిని పెంచడం.. అప్పులు తెచ్చుకుని గట్టెక్కమనడాన్ని కేకే తీవ్రంగా తప్పుపట్టారు. జీఎస్టీ బకాయిలను కేంద్రం స్వయంగా విడుదల చేయడం ద్వారా రాష్ట్రాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటు టీఆర్ఎస్, అటు వైసీపీ కేంద్రంపై నిధుల కోసం యుద్ధం ప్రకటిస్తుంటే వారి ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రయత్నిస్తుండడం విశేషం.

Related Tags