Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • తిరుమల: టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం. టిటిడి బోర్డ్ మీటింగ్ ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం . ఇకపై జరిగే అన్ని బోర్డ్ మీటింగులను అసెంబ్లీ సమావేశాల మాదిరి ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. బోర్డ్ మీటింగ్ లో జరిగే చర్చ అంతా పారదర్శకంగా ప్రజలందరికీ తెలిసేలా ప్రత్యక్ష ప్రసారం.
  • నల్లగొండ: రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు 👉దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • ఇంజనీరింగ్ విద్యార్థిని అశ్లీల చిత్రాలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన విద్యార్థిని గుర్తించిన పోలీసులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ యువకుడికి వీడియోలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ. ఆ యువకుడు మరికొంతమందికి వీడియోస్ షేర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసులో కొనసాగుతున్న విచారణ

Hot news: టీటీడీ ఆస్తుల వేలంపై రాజకీయ రచ్చ

తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. బీజేపీ, సీపీఐ పక్షాలే కాకుండా సామాన్య భక్తజనం టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు.
political controversy over assets auction, Hot news: టీటీడీ ఆస్తుల వేలంపై రాజకీయ రచ్చ

Political uproar over TTD trust board decision on assets auction:  తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయంపై రాజకీయ వివాదం రాజుకుంటోంది. బీజేపీ, సీపీఐ పక్షాలే కాకుండా సామాన్య భక్తజనం టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. తమిళనాడు, రుషికేశ్‌లలో వున్న టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియను ఆపకపోతే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని బీజేపీ, సీపీఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

తమిలనాడులో టీటీడీ ఆస్తుల విక్రయాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఒకటో టౌన్‌ ఓ శ్రీవారి భక్తుడు నిరసన దీక్ష చేపట్టారు. 1వ టౌన్ ఏరియాలో నిరసన దీక్ష చేపట్టిన శ్రీవారి భక్తుడు ఎన్. నరసింహారావు..తమిళనాడులో టీటీడీ ఆస్తుల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. ఆస్తులను అమ్మే హక్కు టీటీడీకి లేదని, టీటీడీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే శ్రీవారి భక్తులను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

మరోవైపు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆదివారం లేఖ రాశారు. తక్షణమే తమిళనాడు, రిషికేష్‌లోని టీటీడీ ఆస్తుల వేలాన్ని ఆపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ‘‘ ప్రపంచమంతా కరోనాతో గగ్గోలు పెడుతుంటే మీరు హడావిడిగా టీటీడీ ఆస్తులను విక్రయించటం సరైంది కాదు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా టీటీడీ బోర్డు వైఖరి ఉంది. మీరు, మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అమ్మేందుకు సిద్ధమైనట్లు ఉన్నది. దాతల ద్వారా టీటీడీకి సమకూరిన ఆస్తులను వేలం వేయడం తగదు.. ఇంత అర్థంతరంగా ఆస్తులను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? ’’ అని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

ఇంకోవైపు బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, భానుప్రకాశ్ రెడ్డిలు టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. భూముల వేలాన్ని వెంటనే నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారు. టీటీడీ ధార్మిక క్షేత్రమని, దాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చవద్దని వారు వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాల ఆస్తులను విక్రయిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఇతర మతాలకు చెందిన సంస్థల భూములను విక్రయించగలరా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. టీటీడీ ఆస్తుల జోలికి వస్తే ఊరుకోమని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

అయితే, టీటీడీ ఆస్తుల వేలాన్ని రాజకీయం చేయవద్దని బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి విఙ్ఞప్తి చేస్తున్నారు. 1974 నుంచి ఆస్తుల వేలం కొనసాగుతోందని, కేవలం నిరర్ధక ఆస్తులను మాత్రమే వేలం వేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు. ఏపీ, తమిళనాడులో ప్రస్తుతం వేలం వేస్తున్న ఆస్తుల్లో 50 శాతం నిరర్ధకమైనవేనని ఆయన చెబుతున్నారు. 50 టీటీడీ ఆస్తుల వేలానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఆయనంటున్నారు.

Related Tags