డ్రోన్‌లో మావోయిస్టుల కదలికలు..

మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు వినియోగిస్తున్న టెక్నాలజీ సత్ఫలితాలనిస్తోంది. పోలీసులు డ్రోన్‌ వీడియో కెమెరా ద్వారా మావోయిస్ట్‌లకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలుసుకున్నారు...

డ్రోన్‌లో మావోయిస్టుల కదలికలు..
Follow us

|

Updated on: Sep 14, 2020 | 10:48 AM

మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు వినియోగిస్తున్న టెక్నాలజీ సత్ఫలితాలనిస్తోంది. పోలీసులు డ్రోన్‌ వీడియో కెమెరా ద్వారా మావోయిస్ట్‌లకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్‌ పరిధిలో పాలోడి అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతున్నట్లు డ్రోన్‌ కెమెరా ద్వారా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. వీరంతా తెలంగాణ వైపు వస్తున్నట్లు గుర్తించారు.

ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు నెలల్లో పలుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 3న భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు, 7వ తేదీన చర్ల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

ఈ క్రమంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తున్నట్లు డ్రోన్‌ కెమెరాలు కనిపెట్టాయి. దీంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాచలం, పినపాక, మంథని నియోజకవర్గాల్లో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..