వాహనాలపై కులం పేరు, ఊరి పేరు ఉంటే అంతే..!

సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా నూతనంగా సవరించిన ట్రాఫిక్ నిబంధనల చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం పలు రాష్ట్రాల్లో ఇంకా అమలు కావడం లేదు. దానికి కారణం లేకపోలేదు. సవరించిన నూతన చట్టంలో వాహనదారులకు షాక్ ఇచ్చేలా పెనాల్టీలు ఉండటమే. అయితే ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వినూత్ర రీతిలో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ ప్రయత్నాలతో పాటుగా […]

వాహనాలపై కులం పేరు, ఊరి పేరు ఉంటే అంతే..!
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 11:57 AM

సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా నూతనంగా సవరించిన ట్రాఫిక్ నిబంధనల చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం పలు రాష్ట్రాల్లో ఇంకా అమలు కావడం లేదు. దానికి కారణం లేకపోలేదు. సవరించిన నూతన చట్టంలో వాహనదారులకు షాక్ ఇచ్చేలా పెనాల్టీలు ఉండటమే. అయితే ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం వాహనదారులకు.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వినూత్ర రీతిలో ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ ప్రయత్నాలతో పాటుగా మరో అడుగు ముందేసి మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాహనాలపై కులం పేరు, ఊరి పేరు కనిపించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలపై కులం, వృత్తులు, సంస్థలు, హోదాలను రాయడం వల్ల సమాజంలో కులతత్వంతో పాటు బేధాభిప్రాయాలు పెరుగుతాయంటూ రాజస్టాన్ సివిల్ రైట్ సోసైటీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ట్రాఫిక్ పోలీసులు తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

కాగా, వాహనదారులు తమ సంస్థల పేర్లు, హోదాలను కూడా వ్యక్తిగత వాహనాలపై ప్రదర్శించకుండా చూడాలంటూ ఇప్పటికే జోధ్‌పూర్, జైపూర్ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు అందాయి. మరోవైపు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి రూ. 1000 వరకు చలానా విధిస్తున్నారు. అయితే అదే చలానాతో వారికి ఉచితంగా హెల్మెట్‌ను కూడా ఇస్తున్నారు. వాహనదారుల్లో మార్పు కోసం ఇలా చేస్తున్నామని.. రాజస్థాన్‌లో పలు ప్రాంతాల్లో తలపాగా పెట్టుకోవడం ఆచారమని.. వారిలో మార్పు వచ్చేందుకు హెల్మెట్‌లు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దేశంలో ఇలా చలానాతో పాటుగా హెల్మెట్ ఇస్తున్న రాష్ట్రం రాజస్థాన్ అవ్వడం విశేషం.