Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

బుడ్డోడు కిడ్నాప్ వెనుక అసలు కథ ఇదే..!

Police Suspects Jashith Relatives Kidnap Case in East Godavari, బుడ్డోడు కిడ్నాప్ వెనుక అసలు కథ ఇదే..!

గతనెలలో జషిత్ కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్పాప్‌కు గురైయ్యాడు. కాగా.. కొన్ని గంటల వ్యవధిలోనే జషిత్ జాడ తెలుసుకున్నారు పోలీసులు. అయితే.. బాలుడి కిడ్నాప్ వెనుక అసలు నిజాన్ని బయటపెట్టారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలోనే ఈ కిడ్నాప్ సాగిందని పేర్కొన్నారు. అంతర్‌ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జషిత్ కిడ్నాప్ వెనుక బంధువుల హస్తం కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా.. ఈ కేసులో క్రికెట్ బెట్టింగ్‌లో సంబంధమున్న 17 మంది బుకీలను అరెస్ట్ చేశామన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని.. బాలుడిని మూడు రోజుల పాటు ఎక్కడ దాచివుంచారన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఎష్పీ నయీమ్ అస్మీ.

Police Suspects Jashith Relatives Kidnap Case in East Godavari, బుడ్డోడు కిడ్నాప్ వెనుక అసలు కథ ఇదే..!