“నేను పాకిస్థాన్ నుంచి వచ్చానా?”.. సీతక్క ఆవేదన

తెలంగాణ‌లోని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు మ‌రోసారి అడ్డుకున్నారు. కొండ ప్రాంతాల‌లోని గిరిజనులకు సరకులు అందించేందుకు వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. కర్ఫ్యూ టైమ్ లో ఎటువంటి కార్యక్రమాలకు ప‌ర్మిష‌న్ లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆక‌లితో అల‌మటిస్తోన్న గిరిజ‌నుల‌కు నిత్యావసర సరకులు అందిస్తున్నామ‌ని.. పోలీసులు స‌హ‌క‌రించాల‌ని సీతక్క కోరారు. అయినా కూడా పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో సరకులను అక్క‌డే ఉన్న కొంద‌రికి అప్పగించి..వాటిని పేద‌ల‌కు పంచిపెట్ట‌మ‌ని చెప్పి సీతక్క వెనుదిరిగి […]

నేను పాకిస్థాన్ నుంచి వచ్చానా?.. సీతక్క ఆవేదన
Follow us

|

Updated on: May 22, 2020 | 8:00 AM

తెలంగాణ‌లోని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు మ‌రోసారి అడ్డుకున్నారు. కొండ ప్రాంతాల‌లోని గిరిజనులకు సరకులు అందించేందుకు వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. కర్ఫ్యూ టైమ్ లో ఎటువంటి కార్యక్రమాలకు ప‌ర్మిష‌న్ లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆక‌లితో అల‌మటిస్తోన్న గిరిజ‌నుల‌కు నిత్యావసర సరకులు అందిస్తున్నామ‌ని.. పోలీసులు స‌హ‌క‌రించాల‌ని సీతక్క కోరారు. అయినా కూడా పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో సరకులను అక్క‌డే ఉన్న కొంద‌రికి అప్పగించి..వాటిని పేద‌ల‌కు పంచిపెట్ట‌మ‌ని చెప్పి సీతక్క వెనుదిరిగి వెళ్లిపోయారు.

అనంతరం పోలీసుల తీరుపై సీతక్క తీవ్ర స్థాయిలో ఫైర‌య్యారు. ప్ర‌స్తుతం తిన‌డానికి గుప్పెడు మెతుకులు దొర‌క్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గిరిజ‌నుల‌కు సాయం చెయ్య‌డానికి వెళుతుంటే తనను అడ్డుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమైన పాకిస్థాన్ నుంచి వచ్చానా అని ప్రశ్నించారు సీత‌క్క‌. ఇసుకను అక్ర‌మ లారీలల్లో దోచుకెళ్తున్నా పోలీసుల‌కు క‌నిపించ‌ద‌ని.. పేద గిరిజనులకు సాయం చేద్దామని వెళ్తుంటే మాత్రం త‌ప్పైపోతుందా అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి సీతక్క గిరిజనులకు సాయం చేస్తూనే ఉన్నారు. నిత్యావసరాల సంచులు స్వయంగా మోసుకుంటూ..వాగులు, వంక‌లు దాటుతూ గిరిజన గూడేలకు వెళ్లి మరీ సరకులు అంద‌జేశారు. ఆమె జనం కోసం అట‌వీ ప్రాంతాల్లో క‌నీసం సెక్యూరిటీ లేకుండా ప‌ర్య‌టిస్తోన్న ప‌లు ఫోటోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి.