Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

రెచ్చిపోతున్న తబ్లిఘి వర్కర్స్.. నర్సింగ్ స్టాఫ్ ముందు అర్దనగ్నంగా…

Police register case against Tablighi Jamaat members for obscene behavior at Ghaziabad hospital, రెచ్చిపోతున్న తబ్లిఘి వర్కర్స్.. నర్సింగ్ స్టాఫ్ ముందు అర్దనగ్నంగా…

తబ్లిఘి జమాత్ సభ్యుల ఆగడాలుకు హద్దు లేకుండా పోతోంది. మొన్నబుధవారం ఢిల్లీ ఆస్పత్రుల్లో కూడా వైద్య సిబ్బందిపై ఉమ్ముతూ.. తాము కోరిన ఆహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తూ.. వైద్య సిబ్బందిపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే.. తాజాగా గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కూడా వీరు రెచ్చిపోయారు. వైద్య సిబ్బంది, నర్స్‌ల ముందు అర్ధనగ్నంగా తిరుగుతూ.. అసభ్యకరమైనా పాటలు పాడుతూ.. మాటలు మాట్లాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. గతనెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మర్కజ్‌కు హాజరైన జమాత్‌ సభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వ సిబ్బందికి సహకరించకపోవడమే కాకుండా.. చికిత్స అందించే వైద్య సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నారు. ఈ తబ్లిఘి జమాత్‌కు చెందిన సభ్యులు.. అక్కడి ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు పరిసరాల్లో అర్ధనగ్నంగా తిరుగుతూ.. అక్కడి నర్సింగ్‌ సిబ్బందికి ఇబ్బందులు కలిగేలా అసభ్య ప్రవర్తన చేస్తున్నారని.. ఆస్పత్రి అధికారులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా ఎస్పీ, మేజిస్ట్రేట్‌ల దృష్టికి లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

దీంతో పోలీసులు ఆరుగురు తబ్లిఘి జమాత్ సభ్యులపై.. ఐపీసీ సెక్షన్.. 354,294,509,269,270,271 ప్రకారం కేసులు నమోదు చేశారు. వైద్య సిబ్బందిపై ఏ విధమైన దుష్ప్రవర్తన చేసిన సహించేది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Related Tags