బోనాల్లో గమ్మత్తు.. మద్యం మత్తులో పోలీస్‌కు ముద్దు!

Police officer firmly spurns reveler’s move to kiss him during Bonalu procession Video Viral, బోనాల్లో గమ్మత్తు.. మద్యం మత్తులో పోలీస్‌కు ముద్దు!

ఆషాడ మాసం బోనాల జాతర చివరి అంకంలో గమ్మత్తు సంఘటన చోటు చేసుకుంది. అమ్మవారి ఫలహార బండి ఊరేగింపు సందర్భంగా యువకులు రోడ్డుపై ఫుల్ జోష్‌లో డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఆ క్రమంలో విధులు నిర్వహిస్తూ అటువైపుగా వచ్చిన ఎస్ఐ మహేందర్‌ను ఓ యువకుడు హఠాత్తుగా వచ్చి గట్టిగా కౌగిలించుకుని.. ముద్దు పెట్టుకున్నాడు.

బోనాలు.. అదీ కూడా పండగ వాతావరణం కాబట్టి మందు మత్తులో చిందేయడం కామన్. కానీ ఆ సదరు యువకుడు చేసిన చిలిపి పనికి ఎస్ఐ తీవ్ర ఆగ్రహానికి గురై చెంప చెళ్లుమనిపించాడు. అయినా కూడా ఆ యువకుడు బెదరకుండా.. నెమ్మదిగా స్టెప్పులు వేస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నవ్వు తెప్పిస్తూ ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *