మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకే!

Police Issue Notice To Man, మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకే!

ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తి హిందువు కాదని వెనక్కి తిప్పి పంపిన వ్యక్తికి మధ్యప్రదేశ్‌ పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. ఇంకోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు అతడికి నోటీసులు పంపారు. రాబోయే ఆరు నెలల్లో మళ్లీ ఈ తరహా ట్వీట్లు చేస్తే జైల్లో పెడతామని అందులో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలు రేకెత్తించే ఈ తరహా వ్యాఖ్యలు తగవని సూచించారు.

హిందూ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని పంపని కారణంగా మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌ శుక్లా జొమాటో ఆర్డర్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్‌ చేశాడు. దీనిపై జొమాటో సైతం ఘాటుగానే స్పందించింది. ఆహారానికి మతం ఉండదని బదులిచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *