అమెరికాలో రివర్స్ సీన్… నిరసనకారులతో పోలీసుల హగ్

అమెరికాలో అసాధారణ దృశ్యం కనిపించింది. నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారికి పోలీసులు సంఘీభావం తెలిపారు. ఎవరూ కనీవినీ..

అమెరికాలో రివర్స్ సీన్... నిరసనకారులతో పోలీసుల హగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 3:07 PM

అమెరికాలో అసాధారణ దృశ్యం కనిపించింది. నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారికి పోలీసులు సంఘీభావం తెలిపారు. ఎవరూ కనీవినీ, ఊహించని ఘటన ఇది ! నార్త్ కెరొలినా లోని ఫటేవిల్లీ ప్రాంతంలో దూసుకువస్తున్న నిరసనకారులను చూసిన 60మంది పోలీసులు… వారిపై విరుచుక పడకుండా వారికి మద్దతు తెలుపుతున్నట్టు ఒక్కసారిగా తాము ఉన్న చోటే వంగి మోకాళ్ళపై కూర్చుండి పోయారు. సుమారు 30 సెకండ్లు అక్కడ హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. పోలీసుల తీరు చూసి ఆందోళనకారులు కూడా ఆశ్చర్యపోయారు. తాము ఊహించని సంఘీభావానికి వారు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కాసేపటికే ఆ ప్రాంతంలో శాంతి నెలకొంది. నిరసకారుల్లో కొందరు ముందుకు వఛ్చి పోలీసులను హగ్ చేసుకున్నారు. ఇటు వారు, అటు పోలీసులూ భావోద్వేగంతో కంట తడి పెట్టడం విశేషం.

ప్రొటెస్టర్లు అనుభవిస్తున్న మానసిక క్షోభను మేం గుర్తించాం.. మన సమాజం లోను,  దేశంలోనూ సమానత్వానికి గల ప్రాధాన్యత వెల కట్టలేనిది. అందరికీ న్యాయం జరగాలని భావిస్తున్నాం.. ప్రతి వ్యక్తి ఏం చెబుతాడన్న దాన్ని శ్రధ్దగా ఆలకించాలి.. వారికి డిగ్నిటీ, రెస్పెక్ట్ ఇవ్వాలన్న లక్ష్యానికి మేం కట్టుబడి ఉన్నాం అని పోలీసు శాఖ ఆ తరువాత ట్వీట్ చేసింది.

అటు-ఈ క్షణాలు చరిత్రలోకెక్కుతాయని, భవిష్యత్ తరాలకు ఓ పాఠం నేర్పుతాయని ఒక నిరసనకారిణి ఫేస్ బుక్ లో పేర్కొంది. కాగా-న్యూయార్క్ తదితర సిటీల్లోనూ ఈ విధమైన శాంతి దృశ్యాలు కనిపించాయి. పోలీసులు, ఆందోళనకారులు కలిసిపోయిన దృశ్యాలు విస్మయం కలిగించాయి. ఈ సీన్స్ ని అధ్యక్ధుడు ట్రంప్ చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో మరి ?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!