దొంగల చేతివాటం… ఏకంగా 108 బైకుల చోరీ

గ్రౌండ్‌లో గ్రీన్‌ మ్యాట్‌ వేసి నీట్‌గా బైకులను సర్దారు. చుట్టూ సైడ్‌ వాల్స్‌ కట్టి అందంగా ముస్తాబు చేశారు. 5 వరుసల్లో మొత్తం 108 బైకులు పార్క్‌ చేశారు. యాక్టివాలు, పల్సర్‌లు, ఫ్యాషన్‌లు.. ఏది కావాలంటే అది.  అచ్చం మల్టీ బ్రాండెడ్‌ షోరూంలా ఏర్పాటు చేశారు.

దొంగల చేతివాటం... ఏకంగా 108 బైకుల చోరీ
Follow us

|

Updated on: Oct 08, 2020 | 3:59 PM

బైకులండి. బైకులు. కొత్త, పాత బైకులు. అన్ని బ్రాండ్‌లు ఒకేచోట. ఏ బండి కావాలంటే అది. స్కూటర్స్‌ నుంచి స్పోర్ట్స్‌ వెహికిల్స్‌ వరకూ. ఆల్‌ బైక్స్‌ ఎట్‌ వన్‌ ప్లేస్‌. ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కనిపిస్తున్న దృశ్యం.

గ్రౌండ్‌లో గ్రీన్‌ మ్యాట్‌ వేసి నీట్‌గా బైకులను సర్దారు. చుట్టూ సైడ్‌ వాల్స్‌ కట్టి అందంగా ముస్తాబు చేశారు. 5 వరుసల్లో మొత్తం 108 బైకులు పార్క్‌ చేశారు. యాక్టివాలు, పల్సర్‌లు, ఫ్యాషన్‌లు.. ఏది కావాలంటే అది.  అచ్చం మల్టీ బ్రాండెడ్‌ షోరూంలా ఏర్పాటు చేశారు.

కరోనా టైమ్‌లో సేల్స్‌ లేక.. ఇంటి వద్దకే  కార్లు అమ్మేందుకు కంపెనీలు ఇలా ఏర్పాటు చేసినట్టు సెటప్‌ చూస్తుంటే అనిపించేలా అద్భుతంగా సర్ధి పెట్టారు. కానీ ఇవి అమ్మడానికి ఏర్పాటు చేసినవి కావు.. ఇవన్నీ దొంగలెత్తుకొచ్చిన మోటర్‌ సైకిల్స్‌. ఒకటి, రెండు కాదు. ఏకంగా 108 బండ్లు. వీటి విలువ 43 లక్షలు.

ఆలమూరు మండలంలో ఆరుగురు దొంగలను పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలే ఇవి. జిల్లా వ్యాప్తంగా వివిధ చోట్ల నుంచి ఎత్తుకొచ్చిన బైకులను ఇలా వరుసగా పేర్చి మీడియా ముందు ప్రదర్శించారు. ఆలమూరు మండలంలోని ఆరుగురు దొంగలే ఇన్ని బైకులు దొంగిలిస్తే.. ఇక పెద్ద పెద్ద నగరాల్లో.. పెద్ద పెద్ద దొంగలు ఏటా ఎన్ని వేల బైకులు ఎత్తుకెళ్లుతున్నారో ఏమోనని లెక్కలేస్తున్నారు.