రవిప్రకాష్ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా..!

Police File Petition For Ravi Prakashs Custody.. Hearing Adjourned For Tomorrow, రవిప్రకాష్ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా..!

టీవీ 9 బహిష్కృత సీఈఓ రవిప్రకాష్ కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రవిప్రకాష్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీవీ9 సంస్థకు చెందిన రూ.18 కోట్లు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను విచారించేందుకు అనుమతించాలని కోరారు. కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే కస్టడీ పిటిషన్‌ విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

మరోవైపు, ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్‌తో పాటు ఐటీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాస్తులు కూడ బెట్టారంటూ రవిప్రకాష్‌పై ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *