ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో మళ్ళీ తుపాకీ పేలుళ్ల మోత, మావోయిస్టులు-పోలీస్ ల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి

ఆంధ్రా ఒడిశా సరిహద్దు మరోసారి తుపాకీ పేలుళ్ళ మోతతో మారుమోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులతో హోరెత్తింది...

ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో మళ్ళీ తుపాకీ పేలుళ్ల మోత, మావోయిస్టులు-పోలీస్ ల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి
Follow us

|

Updated on: Dec 13, 2020 | 4:23 PM

ఆంధ్రా ఒడిశా సరిహద్దు మరోసారి తుపాకీ పేలుళ్ళ మోతతో మారుమోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులతో హోరెత్తింది. ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లా స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలోని గజ్జమామిడి బ్లాక్ సింగారం అటవి ప్రాంతంలో ఒడిశా డీవీఎఫ్, ఎస్ వోజీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొంతమంది మావోయిస్టులున్నట్టు భద్రతాబలగాలకు సమాచారమందడంతో అప్రమత్తమయ్యారు. ఈ లోగా మవోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఓ మహిళా మావోయిస్టు సహా ఇద్దరు హతమయ్యారు. స్పాట్ లో కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కి చెందిన వారుగా గుర్తించారు. మరికొంత మంది మావోయిస్టులు తప్పించుకుని ఉండొచ్చన్న అనుమానంతో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఇటు విశాఖ ఏజెన్సీలో లోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు.