హాజీపూర్ ఘటనలో.. బావులని పూడ్చిన పోలీసులు..!

Hajipur, హాజీపూర్ ఘటనలో.. బావులని పూడ్చిన పోలీసులు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హాజీపూర్ వరుస హత్యోదంతాలపై అధికార యంత్రాంగం కదిలింది. యాదాద్రి జిల్లా హాజీపూర్‌లో సీరియల్ కిల్లర్ శ్రీనివాస రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడ్డ బావులను పూడ్చివేసేందుకు అధికారులు హాజీపూర్ చేరుకున్నారు. యువతులపై అత్యాచారం చేసి.. ఆపై అత్యంత దారుణంగా బావుల్లో పూడ్చిపెట్టిన ఘటన అందరినీ ఆందోళనకు గురి చేసింది.

నరహంతకుడు శ్రీనివాస రెడ్డి.. లిఫ్ట్ ఇస్తానని చెప్పి శ్రావణి, మనీషా, కల్పన అనే ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసి బావుల్లో పూడ్చిపెట్టాడు. ఎప్పటిలా ఏమీ తెలియనట్టు గ్రామస్తులతో కలిసి ఉండే నరహంతకుడి నేరాల చిట్టా మనీషా హత్యతో వెలుగు చూసింది.

ఇక గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి బావులతో పాటు.. నీళ్లు లేని బావులను గుర్తించిన రెవెన్యూ అధికారులు వాటిని పూడ్చివేస్తున్నారు. సీరియల్ కిల్లర్ శ్రీనివాస రెడ్డిని ఉరితీయాలంటూ ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. గ్రామంలో నీళ్లులేని బావులు.. ముఖ్యంగా రోడ్డుకు సమీపంలో ఉన్న వాటిపై దృష్టి సారించారు అధికారులు. తాజాగా అధికారులు చేపట్టిన చర్యలతో మరోసారి హాజీపూర్ వార్తల్లోకెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *