మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు న‌మోదు…

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. త‌న‌ను అయ్యన్నపాత్రుడు అస‌భ్యంగా దూషించార‌ని ఇటీవ‌ల నర్సీపట్నం మున్సిప‌ల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌పై నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు న‌మోదు...
Follow us

|

Updated on: Jun 17, 2020 | 8:26 AM

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. త‌న‌ను అయ్యన్నపాత్రుడు అస‌భ్యంగా దూషించార‌ని ఇటీవ‌ల నర్సీపట్నం మున్సిప‌ల్ కమిషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌పై నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు న‌మోదు చేశారు.

అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిప‌ల్ ఆఫీసులో‌ తొలగించారనే విష‌యంపై వివాదం రాజుకుంది. దీంతో గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో ఓపెన్ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో అయ్యన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో తన మ‌న‌సు నొచ్చుకునేలా అయ్య‌న్న పాత్రుడు అనుచిత కామెంట్స్ చేశారని మున్సిపల్ కమిషనర్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కేసు న‌మోదైంది.

మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునీకరణ పనులు ప్రారంభ‌మ‌వ్వ‌డంతో అయ్యన్నపాత్రుడు తాత లచ్చాపాత్రుడు చిత్రపటాన్ని చైర్మన్‌ గదిలోకి మార్చామ‌ని మున్సిప‌ల్ అధికారులు చెబుతున్నారు. అయితే తన తాత ఫోటోను ఎప్ప‌టి ప్లేసులోనే ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈనెల 15న మున్సిపల్ ఆఫీసు వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని సేమ్ ప్లేసులో ఉంచుతామని కమిషనర్‌ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆమె ఆరోపించారు.