టెండర్ల రద్దు నిర్ణయం సరికాదు.. పోలవరం అథారిటీ

Polavaram project tenders suspends issue Polavaram Project Authority Meeting at Hyderabad, టెండర్ల రద్దు నిర్ణయం సరికాదు.. పోలవరం అథారిటీ

ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయా.? ఇప్పటికే రివర్స్ టెండరింగ్ పేరుతో ఇప్పటికే పనులచేస్తున్న కాంట్రాక్టులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై కేంద్రం కూడా పెదవి విరిచింది. ఈ విధంగా టెండర్లు రద్దు చేస్తే నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని కూడా పార్లమెంట్‌లో మంత్రి గజేంద్రనాథ్‌సింగ్ చెప్పారు.

తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పోలవరం అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అథారిటీ ఛైర్మన్ ఆర్‌.కె.జైన్‌ ఏపీకి బ్యాడ్ న్యూస్ చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశముందన్నారు. సుమారు ఐదు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపైనే చర్చ జరిగింది. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను అథారిటీ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *