Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ త్వరలోనే మనది కాబోతుందా..?

PoK Part Of India.. Expect Jurisdiction Over It One Day: S Jaishankar, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ త్వరలోనే మనది కాబోతుందా..?

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకోబుతున్నట్లు కేంద్రం మరోసారి సంకేతాలు ఇచ్చింది. మోదీ రెండో సారి అధికారం చేపట్టాక.. ఇటు దేశంలో.. అటు అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేస్తున్నారు. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్‌ రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలిసారి జరిగిని పార్లమెంట్ సమావేశాల్లోనే కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టడమే కాకుండా.. ఆ బిల్లును పెద్దల సభలో కూడా పాస్ చేయించేలా ప్లాన్లు వేసి సక్సెస్ అయ్యారు. అందులో భాగంగా జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న స్వయంప్రతిపత్తిని తొలిగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనే జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తవించడం అంటే.. అందులో పీవోకే కూడా భాగమే అంటూ హోం శాఖ మంత్రి అమిత్ షా అనడంతో ప్రత్యర్థి పాక్ గుండెల్లో రైల్లు పరుగెత్తినట్లైంది. త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ను కూడా స్వాధీనం చేసుకుంటామని సంకేతాలను పరోక్షంగానే ఇచ్చారు. అయితే ఆ తర్వాత.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పాక్‌తో చర్చలు అంటే అవి పీవోకే విషయంలోనే అంటూ ఘాటుగా స్పందించారు. అనంతరం మరికొంత మంది బీజేపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

అయితే తాజాగా మరో కేంద్ర మంత్రి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా.. మంగళవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కశ్మీరు భారత దేశానిదేనని చెప్తూ, ఏదో ఓ రోజు దానిపై భౌతిక అధికారాన్ని భారత్ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే, అవి పాక్ ఆక్రమిత కశ్మీరుపైనే జరుగుతాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 370 పూర్తిగా భారత దేశ అంతర్గత వ్యవహారమని చెప్పారు.

ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటోందన్న ఆయన.. ఓ పొరుగు దేశం అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారిందంటూ పరోక్షంగా పాకిస్థాన్ గురించి ప్రస్తావించారు. ఆ దేశం ఉగ్రవాదంపై పోరాడాలని.. ఆ దేశం నుంచి ఉగ్రవాదం భారత్‌కు ప్రత్యేక సవాల్ గా మారిందన్నారు. సరిహద్దులను దాటే ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని పరోక్షంగా పాక్‌కు సూచించారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడే అవకాశం వస్తే ఏం జరుగుతుందో వేచి చూద్దామని చెప్పారు.

అయితే గత వారమే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే.. ఇక త్వరలోనే పీవోకే భారత్‌లో కలవబోతుందని అర్థమవుతుంది. మేము కేవలం కేంద్రం నిర్ణయం, ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని.. కేంద్రం ఆదేశిస్తే.. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నమంటూ బిపిన్ రావత్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. త్వరలోనే.. భారత్ పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు ఆర్మీకి ఆదేశాలు ఇస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి కొద్ది రోజులు వేచి చూస్తే.. ఏం జరుగుతుందో తెలుస్తుంది. అటు పాక్ కూడా అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం చేయబోతున్నామని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు పీవోకేపై టార్గెట్ పెట్టి.. పాక్‌కు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా అన్న వార్తలు వస్తున్నాయి.